హామీలన్నింటినీ నెరవేరుస్తా : అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

 హామీలన్నింటినీ నెరవేరుస్తా : అశ్వారావుపేట ఎమ్మెల్యే  జారె ఆదినారాయణ

అశ్వారావుపేట, వెలుగు: ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్లు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. ఆదివారం ‘హలో శుభోదయం’ కార్యక్రమంలో భాగంగా దమ్మపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రూ.1.10 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ దమ్మపేటను మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దుతానన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం అందించే నిధులను సమర్థవంతంగా వినియోగించి, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే దిశగా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామన్నారు.