ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తరు.. బ్యాంకు లోనూ ఇప్పిస్తరు... ఎస్బీఐ సహకారంతో 64 కోర్సుల్లో శిక్షణ

ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తరు.. బ్యాంకు లోనూ ఇప్పిస్తరు... ఎస్బీఐ సహకారంతో 64 కోర్సుల్లో శిక్షణ
  •   స్వయం ఉపాధికి కేరాఫ్​గా చిలుకూరు ఆర్ఎస్ఈటీఐ
  •      18 ఏండ్ల నుంచి 45 ఏండ్లు ఉంటే చాలు
  •     8 నుంచి పదో తరగతి అర్హత  
  •     లాస్ట్ ఇయర్ 1,018 మందికి ట్రైనింగ్​ 
  •     ఈసారి 1,250 మంది శిక్షణ ఇచ్చేలా టార్గెట్

చేవెళ్ల, వెలుగు: మొయినాబాద్ మున్సిపాలిటీ చిలుకూరు మహిళా ప్రాంగణంలోని డీఆర్డీఏ బిల్డింగ్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో కొనసాగుతున్న ఆర్ఎస్ఈటీఐ ( రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్) స్వయం ఉపాధికి కేరాఫ్​గా నిలుస్తోంది. 18 నుంచి 45 ఏండ్లలోపు గ్రామీణ నిరుద్యోగ యువతకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇస్తూ ఉపాధి మార్గాలు చూపిస్తోంది. 8 నుంచి 10వ తరగతి లోపు చదువుకున్నా.. ఉచిత శిక్షణ, ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు, శిక్షణ తర్వాత టూల్ కిట్స్, బ్యాంక్ లోన్, రెండేండ్ల పాటు అబ్జర్వేషన్ చేస్తూ వాళ్లు ఆర్థికంగా నిలదొక్కుకునేలా సహకారం అందిస్తోంది. ఈ అకాడమిక్ ఇయర్​లో 1,250 మందికి శిక్షణ ఇవ్వాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

అందుబాటులో 64 కోర్సులు

మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్​మెంట్​ఆధ్వర్యంలో బెంగళూరు కేంద్రంగా ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్​యూడీఎస్ ఈటీఐ పర్యవేక్షణలో ఈ సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. చిలుకూరులో ఆర్ఎస్ఈటీఐకి 2005లో ప్రారంభించారు.  ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారం అందిస్తున్న ఈ సంస్థలో  64 కోర్సులు అందుబాటులో ఉన్నాయి.  2024–25 అకాడమిక్ ఇయర్ లో 35 బ్యాచుల్లో 1018 మందికి శిక్షణ ఇచ్చారు. నెల కిందే ప్రారంభమైన ఈ అకాడమిక్ ఇయర్ లో ప్రస్తుతం నాలుగు బ్యాచుల్లో 120 మంది శిక్షణ పొందుతున్నారు. నలుగురు ట్రైనర్లు.. రెండు బ్యూటీ పార్లర్స్, కుట్టుమిషన్, మగ్గం వర్క్స్​పై శిక్షణ ఇస్తున్నారు. తాండూరులోనూ మగ్గం వర్స్క్ పై శిక్షణ ఇస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.  

హాస్టల్​ కూడా ఫ్రీనే..

అభ్యర్థులకు శిక్షణతో  హాస్టల్, భోజన వసతి, యూనిఫాం కూడా ఉచితంగానే ఇస్తున్నారు. పెండ్లయి చిన్న పిల్లలున్న మహిళలకు డేస్ కాలర్ గా కూడా శిక్షణ తీసుకోవచ్చు. నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్​యూడీఎస్ ఈటీఐ నుంచి గుర్తింపు పొందిన అనుభవజ్ఞులైన ట్రైనర్స్​తో ప్రాక్టికల్ ఆధారిత శిక్షణ ఇస్తున్నారు. ఫీల్డ్​లెవెల్​ఎగ్జిబిషన్స్​,  లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్  సౌకర్యాలు కూడా ఉన్నాయి. ట్రైనింగ్ ఇవ్వడమే కాదు అయిపోయాక మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ పేరిట సర్టిఫికెట్, టూల్ కిట్, షాప్ పెట్టుకునేందుకు బ్యాంక్ లోన్లు, ముద్ర లోన్లు ఇప్పిస్తున్నారు. శిక్షణ పూర్తయ్యాక కూడా రెండేండ్ల పాటు అభ్యర్థులను అబ్జర్వేషన్ చేయడంతో పాటు ఏమైనా సమస్యలు ఉంటే తీర్చుస్తున్నారు.  

మహిళలు, పురుషులకు ప్రత్యేక కోర్సులు

64 కోర్సులు అందుబాటులో ఉన్నప్పటికీ  కొన్ని ప్రత్యేక కోర్సులకు మాత్రమే ఎక్కువగా డిమాండ్ ఉంటోంది. లేడీస్​కు టైలరింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్, జూట్ బ్యాగ్ తయారీ, పాడి పరిశ్రమ , వర్మీ కంపోస్ట్, బ్యూటీ పార్లర్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్, అగరబత్తీ తయారీ, వెజిటేబుల్ నర్సరీ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ వంటి కోర్సులకు మంచి స్పందన వస్తోంది.  పురుషులు సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్ రిపేరింగ్, సర్వీసింగ్, బైక్ మెకానిక్,   డ్రైవింగ్, ఫొటోగ్రఫీ , వీడియోగ్రఫీ, సీసీ కెమెరా టెక్నీషియన్, మోటార్ రివైండింగ్, కంప్యూటర్ హార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్, నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్కింగ్, రిఫ్రిజిరేషన్ , ఏసీ రిపేరింగ్ వంటి కోర్సులపై ఆసక్తి చూపుతున్నారు. 

అవకాశాన్ని వినియోగించుకోండి

ఎస్బీఐ సహకారంతో వివిధ కోర్సుల్లో అందిస్తున్న ఉచిత శిక్షణను వినియోగించుకోండి. మా దగ్గరున్న కోర్సుల్లో శిక్షణ పొందాలనుకునే అభ్యర్థులు టెన్త్ క్లాస్ మెమో, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ కాపీలు, 4 పాస్ పోస్ట్ సైజ్ ఫొటోలతో చిలుకూరు మహిళా ప్రాంగంణంలోని డీఆర్డీఏ బిల్డంగ్​కు రావాలి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వాళ్లు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వివరాలకు 7981951167, 8500165190, 9963562266 నెంబర్లను సంప్రదించండి.  –మహమ్మద్ అలీ, చిలుకూరు ఆర్ఎస్ఈటీఐ డైరెక్టర్