కేరళ సీఎంగా వి.డి. సతీసన్: స్టూడెంట్ లీడర్ నుంచి సీఎం కుర్చీ వరకు!

కేరళ సీఎంగా వి.డి. సతీసన్: స్టూడెంట్ లీడర్ నుంచి సీఎం కుర్చీ వరకు!

కేరళ రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా వి.డి. సతీసన్ పేరును కాంగ్రెస్ అధిష్టానం (AICC) అధికారికంగా ప్రకటించింది. 2026 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని UDF కూటమిని అఖండ విజయం దిశగా నడిపించిన సతీసన్, ఇప్పుడు కేరళ రాష్ట్ర బాధ్యతలను చేపట్టబోతున్నారు.

  వి.డి. సతీసన్ బాల్యం, చదువు
 వి.డి. సతీసన్ 1964, మే 31న కొచ్చిలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం చాలా ఉన్నతమైంది. ఆయన సోషల్ వర్క్‌లో పీజీ (MSW) చేశారు. ఇంకా న్యాయశాస్త్రంలో ఎల్‌ఎల్‌బి (LLB), ఎల్‌ఎల్‌ఎమ్ (LLM) పూర్తి చేశారు. రాజకీయాల్లోకి రాకముందు సుమారు పదేళ్ల పాటు కేరళ హైకోర్టులో పేరున్న లాయర్‌గా పనిచేశారు.

స్టూడెంట్ లిడర్ నుండి ముఖ్యమంత్రి వరకు
సతీసన్ ప్రస్థానం కాలేజీ రాజకీయాల నుంచే మొదలైంది. ఆయన కేరళ విద్యార్థి సంఘం (KSU) నాయకుడిగా ఉంటూ జాతీయ స్థాయికి అప్పటి నుండి వరుసగా ఆరు సార్లు (2001 నుండి 2026 వరకు) పారావూర్ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తున్నారు.

ఎన్నికల్లో  విజయం
ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో సతీసన్ నాయకత్వంలో కాంగ్రెస్ కూటమి (UDF) అద్భుత ప్రదర్శన చేసింది. మొత్తం 140 సీట్లలో 102 సీట్లు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. సతీసన్ సొంత నియోజకవర్గంలో 20,600 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.

సతీసన్ ప్రత్యేకత ఏమిటి?
 అసెంబ్లీలో విషయ పరిజ్ఞానంతో, ఆధారాలతో మాట్లాడటంలో ఆయన దిట్ట. కొచ్చి ప్రాంతంలోని అనేక కార్మిక సంఘాలకు ఆయన అధ్యక్షుడిగా ఉంటూ కార్మికుల పక్షాన నిలబడ్డారు. చదువు, ఆరోగ్యం, రోడ్ల అభివృద్ధి వంటి విషయాల్లో అతని నియోజకవర్గంలో వినూత్న మార్పులు తెచ్చారు.

అవార్డులు, గౌరవాలు
ఆయన చేసిన సేవలకు చాలా  పురస్కారాలు లభించాయి.   ఉత్తమ ఎమ్మెల్యేగా,  ఉత్తమ పార్లమెంటేరియన్గా పలు అంతర్జాతీయ సంస్థల నుండి అవార్డులు అందుకున్నారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ నుండి 'ఉత్తమ రాజకీయ నాయకుడు' క్లుడ అవార్డును పొందారు.

వ్యక్తిగత జీవితం
సతీసన్ గారి భార్య పేరు లక్ష్మీ ప్రియ. వారికి ఉన్నిమాయ అనే కుమార్తె ఉంది. ప్రస్తుతం ఆయన కేరళలో కాంగ్రెస్ పార్టీని కొత్త పుంతలు తొక్కించే వ్యూహకర్తగా పేరుగాంచారు.