హైదరాబాద్ విజయవాడ హైవేపై స్తంభించిన ట్రాఫిక్

హైదరాబాద్ విజయవాడ హైవేపై స్తంభించిన ట్రాఫిక్

హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వానల వల్ల చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. రోడ్లన్నీ వరద నీటితో మునిగిపోయాయి. శనివారం కురిసిన భారీ వర్షానికి అబ్దుల్లాపూర్ మెట్ చింతచెరువు నిండి అలుగుపోస్తుంది. ఆ చెరువు కింద ఉన్న రెడ్డికుంట చెరువు కట్ట గత ఏడాది వర్షాలతో తెగిపోయింది. అప్పటినుంచి ఇరిగేషన్ అధికారులు దానికి మరమ్మత్తులు చేయలేదు. దాంతో ఆ చెరువు కింద పొలాలు ఉన్న రైతులు తాత్కాలికంగా కట్ట ఏర్పాటు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం చింత చెరువు నిండి వరద నీరు రెడ్డికుంట చెరువులో భారీగా వస్తుండటంతో.. నీరు చెరువులో నిల్వకుండా కింద ఉన్న పంటపొలాల మీదుగా హైవేపైకి వస్తుంది. దాంతో విజయవాడ హైవేపై వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

గత ఏడాది కూడా ఇదే పరిస్థితి ఉండటంతో నేషనల్ హైవే పూర్తిగా ధ్వంసమైంది. అనంతరం 8 నెలల తర్వాత రిపేర్‎కు నోచుకుంది. ఆ 8 నెలలు ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మళ్లీ ఇప్పుడు రోడ్డుపైకి వరద రావడంతో మరోసారి రోడ్డు ధ్వంసమయ్యే పరిస్థితి నెలకొంది.