- ఇరాన్ యుద్ధమే కారణం
వాషింగ్టన్: లేబర్ డే వీకెండ్లో చివరి సమ్మర్ ట్రిప్ వెళ్దామనుకుంటున్న అమెరికన్లకు ఇంధన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి ఎగబాకాయి. ఏఏఏ మోటార్ క్లబ్ నివేదిక ప్రకారం.. హాలిడే ప్రారంభంలో సాధారణ పెట్రోల్ సగటు ధర గ్యాలన్‌కు 4.14 డాలర్లుగా ఉంది. ఇది గత ఏడాదితో పోలిస్తే దాదాపు డాలర్ ఎక్కువ. ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై దాడి చేసినప్పటి నుంచి క్రూడ్ ఆయిల్ ధరలు అదుపులోకి రాలేదు.
హార్మూజ్ జలసంధి గుండా చమురు రవాణా పడిపోవడం, ఆ జలమార్గాన్ని తెరిచేందుకు ఇరాన్ నిరాకరించడమే ప్రధాన కారణమని ఎనర్జీ ఫైనాన్స్ ప్రొఫెసర్ టామ్ సెంగ్ తెలిపారు. రష్యా రిఫైనరీలు దెబ్బతినడంతో పెట్రోల్ కొరత ఏర్పడిందని ఎకనామిక్స్ ప్రొఫెసర్ మాథ్యూ మెట్జ్గర్ వెల్లడించారు.
