దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీస్ స్టేషన్ల మెయింటెనెన్స్ కోసం నిధులు

దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీస్ స్టేషన్ల మెయింటెనెన్స్ కోసం నిధులు

కామారెడ్డి జిల్లా: 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత అందరి సహకారంతో సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సాధించుకున్నామన్నారు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొల్లేటి దామోదర్. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని పరిశీలించారు కొల్లేటి దామోదర్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కేసీఆర్ పరిపాలన దక్షత, దూరదృష్టితో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకి సాగుతుందన్నారు. సీఎం అయిన తర్వాత మొట్టమొదటి సారిగా పోలీసు ఉన్నతాధికారులతో కేసిఆర్ సమావేశం నిర్వహించారని..శాంతియుత వాతావరణం కోసం పోలీసు శాఖకు 575 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీస్ స్టేషన్ల మెయింటెనెన్స్ కోసం నిధులు ఇస్తున్నారని..కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత 13 జిల్లా పోలీసు కార్యాలయాల నిర్మాణాలతో పాటు రామగుండం, సిద్దిపేటలో పోలీస్ కమిషనరేట్ లు నిర్మాణం జరుగుతున్నాయన్నారు. రెండు కమిషనరేట్లు, కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయం పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధమయ్యాయన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.