రాజ్యాంగంపై బీజేపీకి గౌరవం ఉందా : జి.నిరంజన్

రాజ్యాంగంపై బీజేపీకి  గౌరవం ఉందా :  జి.నిరంజన్

హైదరాబాద్, వెలుగు:  కేంద్రమంత్రి పదవిలో ఉన్న కిషన్ రెడ్డి ఒక మత విద్వేషిలా మాట్లాడటం తగదని పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జి. నిరంజన్ పేర్కొన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై బీజేపీకి గౌరవముందా అని ప్రశ్నించారు. మంగళవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ మేనిఫెస్టో హిందూ వ్యతిరేకమని, తమ పార్టీ అధికారంలోకి వస్తే జిన్నా రాజ్యాంగం వస్తుందని  కిషన్ రెడ్డి అనడంపై నిరంజన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 

అంబేద్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని రూపొందించి అమల్లోకి తెచ్చిందే కాంగ్రెస్ అని తెలిపారు. ఆ వాస్తవాన్ని మరిచి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జిన్నా రాజ్యాంగం వస్తుందని చెప్పడం తగదని వెల్లడించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ఏ అంశం హిందూ వ్యతిరేకమో చెప్పాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తా మన్నారు.