- అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ లోని గౌళీకార్నర్సింగ్ ఫంక్షన్ హాల్లో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లకు జిల్లా స్థాయి శిక్షణ, సన్నాహక సమావేశం నిర్వహించారు.
దీనికి హాజరైన అసెంబ్లీ స్పీకర్‌గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ జిల్లా నుంచి ముఖ్యమంత్రితో పాటు తను ఉన్నత స్థానాల్లో ఉన్నామని, అవసరమైన నిధులు మంజూరు చేయించే బాధ్యత తమదన్నారు. వాటిని సమర్ధవంతంగా ఖర్చు చేసే బాధ్యత ప్రజా ప్రతినిధులదన్నారు. కలెక్టర్ దీపక్ తివారి, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, ఎస్పీ స్నేహామెహ్రా, అడిషనల్కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ పాల్గొన్నారు.
