కేసీఆర్, కేటీఆర్కు గడ్డం వంశీ కృష్ణ సవాల్

కేసీఆర్, కేటీఆర్కు గడ్డం వంశీ కృష్ణ సవాల్

దమ్ముంటే ఒక్కసారి చెన్నూరులో కేసీఆర్, కేటీఆర్ పర్యటించాలన్నారు చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి కుమారుడు వంశీ కృష్ణ. చెన్నూరు దుస్థితి ఎలా ఉందో చూడాలన్నారు. ఎలక్షన్ ముందు చెన్నూరులో సింగిల్ గా KTR, KCR, బాల్క సుమన్ ఒక్కసారి పర్యటించాలన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ ఉద్యమం మొదలైందన్నారు. నవంబర్ 30న ఓటుతో కొడితే సర్కార్ పెద్దల దిమ్మ తిరగాలన్నారు వంశీ కృష్ణ. 

చెన్నూరులో కాంగ్రెస్ నుంచి వివేక్ వెంకటస్వామి పోటీ చేస్తుండగా.. బీఆర్ఎస్ నుంచి బాల్కసుమన్..బీజేపీ నుంచి దుర్గం అశోక్ బరిలోకి దిగుతున్నారు. వివేక్ వెంకటస్వామి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. 


ALSO READ :- ఆర్థిక నేరస్థులకు బేడీలు వేయొద్దు : పార్లమెంటరీ కమిటీ సిఫార్సు