కంటోన్మెంట్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయం: వెన్నెల

కంటోన్మెంట్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయం:  వెన్నెల

కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ప్రజా యుద్ధ నౌక గద్దర్ కూతురు వెన్నెల ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం(నవంబర్ 5) కంటోన్మెంట్ లో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించామని, ఈనెల 9న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు.

 కంటోన్మెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వెనుకంజ వేయలేదని, ఓయూ జెఏసితోపాటు విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాల మద్దతుతో ప్రచారం ఉదృతంగా చేనున్నట్లు తెలిపారు.  కాంగ్రెస్ నుండి టికెట్ ఆశించిన వారందరినీ కలుపుకొని ప్రజల్లోకి ఆరు గ్యారంటీలను తీసుకువెళ్లి విజయకేతనం ఎగురవేస్తామని చెప్పారు.  బిఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ.. ప్రజా సమస్యలను తెలుసుకుని వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తామని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని.. కంటోన్మెంట్ లో వెన్నెల వెలుగు ఖాయమని విద్యార్థి నాయకులు చెప్పారు.