
నా జాతి.. నా వారసత్వాన్ని కొనసాగిస్తుంది : గద్దర్ అక్షర యజ్ణనా దేశంలో నా ప్రజలు ఎంతకాలం మునుషులుగా గుర్తించబడరో అంతకాలం ఈ తిరుగుబాటు గీతం పాడుతూనే ఉంటారు. నా జాతి నా వారసత్వాన్ని కొనసాగిస్తుంది.. ఇవి గద్దర్ మాటలు.. JNM ప్రచురణలు పేరుతో గద్దర్.. తానే స్వయంగా 1991-, 92 ల్లో వేసుకున్న 12 పేజీల పాటల బుక్ లెట్ కు విలక్షణంగా, వినూత్నంగా ముఖచిత్రం తన చేతి రాతతో ఇలా తయారు చేశారు గద్దర్.... ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
గద్దర్ చేతి రాతతో.. తన పుస్తకంపై.. తన స్వహస్తాలతో రాసిన వ్యాఖ్యలనే కవర్ పేజీగా పెట్టుకోవటం విశేషం. నా జాతి.. నా వారసత్వాన్ని కొనసాగిస్తుంది అనే చివరి వ్యాఖ్యలు చూస్తుంటే.. రేపటి తరం.. సమాజంలోని అంతరాన్ని.. అవినీతిని ప్రశ్నించమని పిలుపునిచ్చినట్లు స్పష్టం అవుతుంది. మనుష్యులుగా గుర్తించబడరో అంత కాలం ఈ తిరుగుబాటుగీతం పాడుతూనే ఉంటాను అని చెప్పటం ద్వారా.. నేను లేకున్నా నా పాట ద్వారా.. ఈ సమాజాన్ని మేల్కొలుపుతూనే ఉంటాను.. పీడిత, అణగారిన వర్గాలకు అండగా.. నా పాట ఉంటుందనే అర్థాన్ని.. రేపటి తరానికి.. నాలుగు వాఖ్యాల్లో అద్భుతంగా చెప్పిన తీరు.. గద్దర్ కే సాధ్యం అయ్యింది.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (ఆగస్టు 6వ తేదీన) కన్నుమూశారు. గుండెపోటుతో కొద్దిరోజుల క్రితం అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌లో చేరారు. అక్కడే గద్దర్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. గద్దర్ స్థాపించిన మహాబోధి విద్యాలయంలో అంత్యక్రియలు చేయనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.