సరిపడా నీళ్లు, వెలుతురు అందక ఇంటి బాల్కనీలో పెంచుతున్న మొక్కల్లో కొన్ని చనిపోతుంటాయి. అందుకే మొక్కల హెల్త్ కాపాడేందుకు ఇలాంటి డివైజ్ వాడాలి. వోల్బ్లిక్స్ సాయిల్ టెస్టర్ అనే ఈ డివైజ్ త్రీ ఇన్ వన్ మీటర్‌గా పనిచేస్తుంది. మట్టిలోని తేమ శాతం, పీహెచ్ వాల్యూని కొలుస్తుంది. మొక్కకు సరిపడా వెలుతురు అందుతుందా? లేదా? అనేది కూడా ఈ మీటర్‌తో తెలుసుకోవచ్చు. దీనికి రెండు పొడవాటి కడ్డీలు ఉంటాయి. వాటిని మొక్క ఉన్న మట్టి తొట్టిలో నాటితే చాలు. మీటర్లో వాల్యూ చూపిస్తుంది.
ధర: 499 రూపాయలు
యుబెల్లా
రిస్ట్ వాచీ పెట్టుకోవడం కామన్. కానీ.. వేలికి వాచ్ పెట్టుకోవడం ఎక్కడైనా చూశారా? అవును ఈ వాచీని వేలికే పెట్టుకోవాలి. హద్దుల్లేని ఫ్యాషన్ ప్రపంచంలో ఇలాంటి డిఫరెంట్ వేరబుల్ గాడ్జెట్స్ ఎన్నో ఉన్నాయి. ఇది గిఫ్ట్‌గా ఇవ్వడానికి బెస్ట్ గాడ్జెట్. దీన్ని ఇంటర్నేషనల్ ప్రమాణాల ప్రకారం నికెల్, లెడ్ వాడకుండా తయారుచేశారు. అందువల్ల ఇది స్కిన్ ఫ్రెండ్లీ కూడా. దీనికి వేసిన కోటింగ్ వల్ల ఎలాంటి అలర్జీలు కూడా రావు. కాకపోతే ఇది యూజ్ అండ్ త్రో గాడ్జెట్ అనే చెప్పాలి. ఎందుకంటే.. ఇది పాడైతే రిపేర్ చేయడం, బ్యాటరీ మార్చడం రెండూ కష్టమే.
ధర: 245 రూపాయలు
వేలికి పెట్టుకునే వాచీ
డైలీ లైఫ్‌లో చాలా రకాల గాడ్జెట్స్ వాడుతుంటాం, చూస్తుంటాం. కానీ, రెగ్యులర్‌గా వాడని చాలా రకాల గాడ్జెట్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని ఫ్యాషన్ కోసం, మరికొన్ని కంఫర్ట్స్ కోసం వాడుతుంటాం. అలాంటి కొన్ని డిఫరెంట్ గాడ్జెట్స్ కొన్ని..
స్కాన్ డోర్ బెల్
ఇప్పటికే వీడియో డోర్ బెల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ, ఇది ఆ కొత్త తరం డోర్ బెల్. దీనికి కరెంట్, వైరింగ్, ప్రత్యేకంగా వైఫై కనెక్షన్, డివైజ్‌లు అవసరం లేదు. ఒక క్యూఆర్ కోడ్ ఉంటే చాలు. ‘డోర్వీ’ అనే కంపెనీ ఈ సర్వీసు అందిస్తోంది. వీళ్లు ఇచ్చే క్యూఆర్ కోడ్‌ని డోర్‌కి స్టిక్ చేయాలి. ఇంటికి వచ్చిన వాళ్లు.. వాళ్ల ఫోన్లో ఆ కోడ్‌ని స్కాన్ చేస్తే వెంటనే ఓనర్ మొబైల్లో ఉన్న డోర్వీ యాప్‌కి అలర్ట్ వెళ్తుంది. వీడియో కాల్లో వాళ్లతో మాట్లాడొచ్చు. ఈ క్యూఆర్ కోడ్ కార్డ్ వాటర్, స్క్రాచ్ రెసిస్టెంట్. క్యూఆర్ కార్డ్‌పై ‘‘స్కాన్ క్యూఆర్ కోడ్ టు కాంటాక్ట్ ఇన్సైడ్” అని రాసి ఉంటుంది. అలాగే కోడ్ ఎలా స్కాన్ చేయాలో కూడా ఉంటుంది.
ధర: 350 రూపాయలు
ఛార్జింగ్ లైట్
కరెంట్ పోయినప్పుడు ఇంట్లో ఛార్జింగ్ లైట్, మొబైల్లో ఛార్జింగ్ లేకపోతే పరిస్థితి ఏంటి? అలాంటి పరిస్థితుల్లో ఉపయోగపడే బెస్ట్ గాడ్జెట్..‘హోమ్ క్యూబ్’ తీసుకొచ్చిన స్మార్ట్ కంట్రోల్ సెన్సర్ ఎల్ఈడీ లైట్. ఇది బెడ్‌రూమ్, బాత్రూమ్, హాల్, కిచెన్, లివింగ్ రూమ్, బాల్కనీ, వేర్‌హౌస్, ఇండోర్, అవుట్‌డోర్.. ఇలా ఎక్కడైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది మల్టీ ఫంక్షన్ లైట్. దీన్ని ఆన్ చేసి, కరెంట్ సాకెట్లో పెడితే.. పవర్ కట్ కాగానే ఆటోమెటిక్‌గా వెలుగుతుంది. మిగతా టైంలో ఛార్జ్ అవుతుంది. దీనికి రెండు యూఎస్బీ పోర్ట్‌లు ఉంటాయి. ఒకేసారి రెండు డివైజ్‌లు ఛార్జింగ్ చేయొచ్చు. అయితే.. రెండు డివైజ్‌లు ఒకేసారి ఛార్జ్ చేస్తే రెండు పోర్ట్‌ల నుంచి 1A అవుట్‌పుట్ మాత్రమే వస్తుంది. ఒకే డివైజ్ ఛార్జ్ చేస్తే.. 2A అవుట్‌పుట్ వస్తుంది. లైట్‌ని అడ్జస్ట్ చేసుకోవడానికి మూడు మోడ్స్ కూడా ఉంటాయి.
ధర: 599 రూపాయలు
