
మెహిదీపట్నం, వెలుగు : గంజాయి, డ్రగ్స్ ను తరలిస్తున్న ఇద్దరిని ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గోల్కొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో శ్రావణి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ ఎన్ ఫోర్స్ మెంట్ ఏసీ అనిల్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం రాత్రి 11:30 గంటలకు మెహిదీపట్నంలో ఎక్స్ ప్రెస్ వే పిల్లర్ నం. 55 వద్ద రూట్ వాచ్ చేస్తున్నారు.
ఇద్దరు వ్యక్తులు హోండా యాక్టివాపై అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా.. 1.1 కిలో ఎండు గంజాయి, 12 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ దొరికాయి. నిందితులు ధూల్ పేటకు చెందిన రాహుల్ సింగ్, ఆనంద్ సింగ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. హైదరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ చంద్రశేఖర్ గౌడ్, ఎస్ఐ శ్రీనివాస్ , సిబ్బంది ఉన్నారు.
730 గ్రాముల గంజాయి సీజ్ ..
చేవెళ్ల : పశ్చిమ బెంగాల్ కు చెందిన శహిర్ మియా (33), నూర్ ఇస్లాం(31) సిటీకి వచ్చి చేవెళ్ల మీదుగా గంజాయిని తరలిస్తున్నారు. గురువారం ఉదయం పోలీసుల తనిఖీల్లో వీరు అనుమానాస్పదంగా కనిపించగా చెక్ చేయగా 730 గ్రాముల ఎండు గంజాయి ప్యాకెట్లు లభించాయి. నిందితులను అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్ఐ వీరబ్రహ్మం తెలిపారు.