- మంత్రి కొండా సురేఖను కోరిన గజ్వేల్ నేతలు
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గజ్వేల్ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా పంపిణీ చేసిన డబుల్ బెడ్ రూం ఇండ్ల పై సర్వే చేయాలని గజ్వేల్ నియోజకవర్గ నేతలు మెదక్ జిల్లా ఇన్ చార్జ్ మంత్రి కొండా సురేఖను కోరారు. మంగళవారం సెక్రటేరియెట్ లో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా అర్హులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించాలని నేతలు కోరారు. కలెక్టర్ తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి సర్వే చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్టు నేతలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.