
హైదరాబాద్, వెలుగు : ఉచిత సేవ చేస్తాం.. అనుమతించండి అంటూ గాంధీ హాస్పిటల్ స్టాఫ్ నర్సులు సూపరింటెండెంట్‌ను అర్థించారు. ఈమేరకు వినతిపత్రం అందించారు. తామంతా యూసీడీఎస్ అనే సంస్థ ద్వారా ఎమర్జెన్సీ విభాగంలో కాంట్రాక్టు పద్ధతిన మూడేళ్ల క్రితం ఉద్యోగంలో చేరామన్నారు. గత నెలలో వీరిని పనులకు రావద్దంటూ నోటీసులు జారీ చేసింది. దీంతో మూడేళ్లుగా 25 మంది నర్సులం గాంధీ హాస్పిటల్ లోనే ఉపాధి పొందుతున్నామన్నారు. పరిస్థితిని సూపరింటెండెంట్ మంత్రి ఈటెల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా స్టాఫ్ నర్సెస్ , బ్రదర్స్ ను ఆదుకుంటామని ఈటల హామీ ఇచ్చినట్లు సూపరింటెండెంట్ తెలిపారు. ఐతే యూసీడీఎస్ ఇచ్చిన గడువు ఈ నెలతో ముగియటంతో ఉద్యోగులంతా ఒక నెల ఉచితంగా సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు తమకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఉద్యోగులు సౌందర్య, సంధ్య, ధనమా బ్రదర్, గాంధీ హాస్పిటల్ లో రోగుల సహాయకుడు కృష్ణ పూజారి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ ను కోరారు.