నేటి నుంచి గాంధీ హాస్పిటల్​లో జూడాల సమ్మె

నేటి నుంచి గాంధీ హాస్పిటల్​లో జూడాల సమ్మె

హైదరాబాద్, వెలుగు: గాంధీ హాస్పిటల్‌‌లో నాన్ కోవిడ్‌‌ వైద్య సేవలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు (జూడాలు) ఆదివారం నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు.  ప్రస్తుతం గాంధీలో టీచింగ్ స్టాఫ్, సుమారు 600 మంది రెసిడెంట్ డాక్టర్లు, 350 మంది ఇంటర్న్స్‌‌ ఉండగా, కేవలం 400 మంది పేషెంట్లు మాత్రమే ఉన్నారు. 400 మందికి వెయ్యి మంది డాక్టర్లు అవసరం లేదని, వెంటనే నాన్‌‌ కోవిడ్ సేవలు ప్రారంభించాలని సూపరింటెండెంట్‌‌కు జూడాలు నోటీసు ఇచ్చారు. ఏడు నెలలుగా కేవలం కరోనా పేషెంట్లను మాత్రమే చేర్చుకుంటున్నారని, తమకు ఇతర రోగులను పరీక్షించే అవకాశం దక్కడం లేదన్నారు. దీనివల్ల ‘క్లినికల్ ఎక్స్‌‌పీరీయన్స్‌‌’ కోల్పోతున్నామని జూడాలు పేర్కొన్నారు.