- కలెక్టర్ ప్రియాంక ఆల
పద్మారావునగర్, వెలుగు : గాంధీ దవాఖాన అభివృద్ధి కోసం రూ. 8.27 కోట్ల ఆరోగ్యశ్రీ రివాల్వింగ్ ఫండ్ కేటాయించామని గాంధీ దవాఖాన అభివృద్ధి సొసైటీ చైర్మన్, కలెక్టర్ ప్రియాంక ఆల స్పష్టం చేశారు. ఈ నిధులతో టీజీఎంఎస్‌ఐడీసీ ద్వారా అవసరమైన మెడికల్ఎక్విప్మెంట్కొనాలని, గత బకాయిల చెల్లించాలని అధికారులను ఆదేశించారు. గాంధీ దవాఖాన సెమినార్ హాలులో ఐదేండ్ల తర్వాత గురువారం నిర్వహించిన హెచ్‌డీఎస్ సమీక్ష సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హెచ్‌డీఎస్ ఖాతాలో ఉన్న రూ.6 కోట్లను అవసరాల మేరకు వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వం నుంచి గాంధీ ఆరోగ్యశ్రీ విభాగానికి రూ. 70 కోట్లు రావాల్సి ఉందని గాంధీ అధికారులు కలెక్టర్‌దృష్టికి తీసుకురాగా, తానే స్వయంగా ప్రిన్సిపల్‌సెక్రటరీతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గాంధీ సూపరింటెండెంట్ప్రొఫెసర్వాణి, ప్రిన్సిపాల్‌ప్రొ. ఇందిర, డిప్యూటీ సూపరింటెండెంట్‌ప్రొ.సునీల్‌కుమార్, ఎబోలా స్టేట్ నోడల్ ఆఫీసర్ ప్రొ.సునీల్‌కుమార్ పాల్గొన్నారు.
