గాంధీ మెడికల్ కాలేజీలో యువ డాక్టర్లకు న్యూరోసైన్సెస్ ‘మాస్టర్ క్లాస్’

గాంధీ మెడికల్ కాలేజీలో యువ డాక్టర్లకు న్యూరోసైన్సెస్  ‘మాస్టర్ క్లాస్’

పద్మారావునగర్, వెలుగు: న్యూరాలజీ, న్యూరోసర్జరీ రంగాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పులపై యువ డాక్టర్లకు అవగాహన కల్పించేందుకు గాంధీ మెడికల్ కాలేజీలో శనివారం ‘మాస్టర్ క్లాస్ ఇన్ న్యూరాలజీ అండ్ న్యూరోసర్జరీ’ పేరుతో ప్రత్యేక శిక్షణా సదస్సు నిర్వహించారు. రెండు రోజుల పాటు సాగే ఈ సదస్సును డాక్టర్ ధైర్యవాన్, డాక్టర్ రాజారెడ్డి, రవీంద్రనాథ్ గరగ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా డాక్టర్లు జె.ఎం.కె. మూర్తి, డాక్టర్ టి.వి.ఆర్.కె. మూర్తి, డాక్టర్ సయ్యద్ అమీర్ బాషా మాట్లాడుతూ.. పీజీ వైద్య విద్యార్థులు, రెసిడెంట్ డాక్టర్లలో క్లినికల్ నైపుణ్యాలను పెంపొందించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని తెలిపారు.