ఇన్వెస్ట్ మెంట్లకు బెస్ట్ డెస్టినీ గండి మైసమ్మ

ఇన్వెస్ట్ మెంట్లకు బెస్ట్ డెస్టినీ గండి మైసమ్మ

హైదరాబాద్ నుంచి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న గండి మైసమ్మ ప్రాంతం డెవలప్ మెంట్ కు సెంటర్ గా మారుతోంది. కోర్ సిటీ నుంచి ఇక్కడకు చేరుకునేందుకు మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులో ఉండటంతోపాటు నెహ్రూ ఓఆర్ఆర్ నుంచి బౌరంపేట, బాచుపల్లి, విస్పర్ వ్యాలీ ఇతర ప్రాంతాలకు సులభంగా చేరుకోవచ్చు. బాచుపల్లి, మెదక్ రోడ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాంతంలో స్కూళ్లు, ఆస్పత్రులు, మార్కెట్లు, సూపర్ మార్కెట్లతోపాటు విద్యాసంస్థలకు కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే కమర్షియల్ యాక్టివిటీ పెరుగుతోంది. ఇక్కడి నుంచి 3–7 కి.మీ దూరంలోనే షాపింగ్ మాల్స్, మల్టీ ప్లెక్సులు జీకే ఒన్ మాల్, ఫోరం సుజనా మాల్, మంజీరా మాల్ అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు గౌడవల్లి, గుండ్ల పోచంపల్లి రైల్వేస్టేషన్లు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. 16 కిలోమీటర్ల దూరంలో జేఎన్టీయూ మెట్రో స్టేషన్ ఉంది. ఉజ్వల గ్రాండ్, మై హట్ రెస్టారెం ట్, శ్రీ రాఘవేంద్ర భవన్ లాంటి రెస్టారెంట్లు , హోటళ్లు, కేఫ్ లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే
కమర్షియల్ యాక్టివిటీ పెరుగుతున్న క్రమంలో ఫ్యూచర్ ఇన్వెస్ట్ మెంట్ కోసం చూసే వినియోగదారులకు గండిమైసమ్మ బెస్ట్ డెస్టెనీ అవుతుందనీ
రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.