కరీంనగర్ క్రైమ్, వెలుగు: బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వావిలాలపల్లికి చెందిన పుతుపరంబిల్ రోహన్ (19) ఈ నెల 13న తీగలగుట్టపల్లి శివారులోని బాక్స్ క్రికెట్ మైదానానికి స్నేహితులతో కలిసి వెళ్లాడు. సమీపంలోని కిరాణా దుకాణం వద్ద ఉండగా దుర్గమ్మగడ్డకు చెందిన దావ దర్శన్ (27), గాంధీనగర్‌కు చెందిన కాసారపు రోహిత్ కుమార్ అలియాస్ రిషి (22) అతన్ని కొద్దిదూరం తీసుకెళ్లి డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తూ దాడి చేశారు.
అతని తగ్గర డబ్బులు లేకపోవడంతో.. అతన్ని వదిలేసి, అక్కడే ఉన్న గన్నేరువరం మండలానికి చెందిన కొనగాని మధు పై కూడా చేరి బెదిరింపులకు పాల్పడ్డాడు. భయపడిన రోహన్ తన వద్ద ఉన్న ఐఫోన్‌ను వారికి ఇచ్చాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి గాలింపు చేపట్టిన పోలీసులు శనివారం బొమ్మకల్ బైపాస్ సమీపంలోని సమీర్ దాబా వద్ద నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి స్విఫ్ట్ డిజైర్ కారు, ఐఫోన్, మూడు మొబైల్ ఫోన్లు, రూ.5 వేల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
