
హైదరాబాద్ లోని తార్నాకలో మహిళపై గ్యాంగ్ రేప్ కలకలం సృష్టిస్తోంది. బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. డిసెంబర్ 7న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐదుగురు నిందితులను లాలాగూడ పోలీసులు అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే.. డిసెంబర్ 7న లాలాపేటలో ఉండే బైక్ మెకానిక్ బర్న యేసు (32) అర్థ రాత్రి బైక్ పై తార్నక నుంచి ప్రశాంత్ నగర్ వెళ్తుండగా బస్ కోసం ఎదరు చూస్తున్న మహిళలను లాలాపేటలో దింపుతామని నమ్మించి బైక్ ఎక్కించుకుని తీసుకెళ్లాడు. ఆమెను ప్రశాంత్ నగర్ రైల్వే క్వార్టర్స్ దగ్గర ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బెదిరించాడు. అంతేగాకుండా తన ఐదుగురు ఫ్రెండ్స్ మధుయాదవ్(31),ప్రశాంత్ (20), తరుణ్ (20),రోహిత్(19) తో కలిసి అత్యాచారం చేశారు. అత్యాచారం తర్వాత తార్నకలో బండిపై బాధితురాలిని వదిలేశాడు నిందితుడు మధు. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో లాలాగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆదివారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.