గ్యాంగ్‌రేప్ బాధితురాలి అంత్యక్రియలను అడ్డుకున్న పోలీసులు

గ్యాంగ్‌రేప్ బాధితురాలి అంత్యక్రియలను అడ్డుకున్న పోలీసులు

పెద్దపల్లి జిల్లాలో గ్యాంగ్‌రేప్ లో చనిపోయిన  మైనర్ బాలిక అంత్యక్రియలు జరగలేదు.  మధ్యప్రదేశ్ కు వెళ్లిన పెద్దపల్లి పోలీసులు బాలిక అంత్యక్రియలను అడ్డుకున్నారు.   సాక్ష్యాధారాల కోసం మృతి చెందిన బాలిక అంత్యక్రియలు జరగకుండా అడ్డుకున్నారు.  అయితే బాలిక అంత్యక్రియలు అక్కడే చేస్తారా లేకా పెద్దపల్లికి తరలిస్తారా అన్న దానిపై స్పష్టత లేదు.  

మైనర్ బాలిక పై గ్యాంగ్ రేప్ ఘటనను పెద్దపల్లి పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు.  ఏసీపీ మహేష్ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ లోని బలగట్ జిల్లా కజరి గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  బాధితురాలి ఆడియో రికార్డింగ్ ఉన్న  ఎందుకు పోలీసులకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్ని్ంచారు. అంతేకాకుండా బాధితురాలు అస్వస్థతకు గురయ్యాక ఆసుపత్రికి తరలించకుండా మధ్యప్రదేశ్ కు ఎందుకు పంపారు.  మైనర్ మృతి చెందిన తర్వాత మధ్యప్రదేశ్ కు  పంపరా లేకా  మార్గమధ్యంలో చనిపోయిందా. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

మధ్యప్రదేశ్‌కు చెందిన10 కుటుంబాలు అప్పన్నపేట శివపార్వతి కాలనీలో అపార్ట్​మెంట్ల నిర్మాణ పనులు చేస్తూ అక్కడే గుడారాలు వేసుకొని ఉంటున్నాయి. వీరితోనే ఉంటున్న 15 ఏండ్ల బాలికను ఈనెల 14న నలుగురు యువకులు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేశారు. 15వ తేదీ మధ్యాహ్నం అపార్ట్​మెంట్ల ముందు వదిలిపోయారు.

 అపస్మారక స్థితిలో, తీవ్ర రక్తస్రావంతో గుడారానికి చేరుకున్న బాలికను ఆమె అక్క, బావ, కాంట్రాక్టర్​మధ్యప్రదేశ్​తరలిస్తుండగా చనిపోయింది. ఇంటెలిజెన్స్ వర్గాల ​ద్వారా విషయం తెలుసుకున్న పెద్దపల్లి పోలీసులు వెంటనే మధ్యప్రదేశ్​ పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో అక్కడి పోలీసులు డెడ్​బాడీని హ్యాండోవర్​ చేసుకొని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. గురువారం పెద్దపల్లి పోలీసులు మధ్యప్రదేశ్​ బయలుదేరివెళ్లారు.