బిహార్ నుంచి హైదరాబాద్ కు.. గంజాయి చాక్లెట్లు

బిహార్ నుంచి హైదరాబాద్ కు.. గంజాయి చాక్లెట్లు
  • 11 కిలోలు పట్టివేత.. ఒకరి అరెస్ట్ 

జీడిమెట్ల, వెలుగు : బిహార్ నుంచి సిటీకి గంజాయి చాక్లెట్లను తెచ్చి అమ్ముతున్న వ్యక్తిని మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు. బిహార్‌‌‌‌కు చెందిన నంద్‌‌లాల్ కుమార్ (20) బతుకుదెరువు కోసం మేడ్చల్‌‌లోని బాసరగడికి వచ్చి లతా పాన్ మహల్ పేరుతో పాన్ షాప్ నడుతున్నాడు. జల్సాలు, ఈజీ మనీ కోసం అదే షాప్‌‌లో బిహార్ నుంచి తెచ్చిన గంజాయి చాక్లెట్లను అమ్ముతున్నాడు.

ALSO READ: అస్వస్థతకు కలుషిత ఆహారమే కారణం .. వార్డెన్​పై సస్పెన్షన్ వేటు

పక్కా సమాచారంతో మేడ్చల్ ఎక్సైజ్ టాస్క్‌‌ఫోర్స్ అధికారులు శుక్రవారం అతడి షాప్‌‌పై దాడులు చేశారు. 11.6 కిలోల 58 గంజాయి చాక్లెట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో ప్యాకెట్‌‌లో 5 గ్రాముల 40 చాక్లెట్లు ఉన్నట్లు తెలిపారు. నిందితుడిని రిమాండ్​కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.