స్పీకర్ ఫార్మట్‌లో రాజీనామా చేసిన గంటా శ్రీనివాస రావు

స్పీకర్ ఫార్మట్‌లో రాజీనామా చేసిన గంటా శ్రీనివాస రావు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా శ్రీనివాస రావు రాజీనామా చేశారు. తన రాజీనామా లెటర్‌ను స్పీకర్ ఫార్మాట్‌లో రాసి.. ఏపీ స్పీకర్‌కు పంపారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేయోద్దంటూ గంటా మూడు రోజుల క్రితం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన తన రాజీనామా పత్రంలో ఎందుకు రాజీనామా చేస్తున్నానే విషయాన్ని కూడా పొందుపరిచారు. అలా కారణం తెలుపుతూ రాజీనామా చేయడం స్పీకర్ ఫార్మాట్‌కు విరుద్దం. దాంతో రాజకీయ ఎత్తుగడలో భాగంగానే గంటా ఈ విధంగా రాజీనామా చేశారని రాజకీయ విమర్శలు వచ్చాయి. వాటన్నింటిని పటాపంచలు చేస్తూ.. ఈ రోజు కూర్మన్నపాలెం గేట్ దగ్గర కార్మిక సంఘాలు చేస్తున్న రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న గంటా.. స్పీకర్ ఫార్మాట్‌లో తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.

For More News..

ఐపీఎల్ వేలంలో అర్జున్ టెండూల్కర్ కనీస ధర రూ. 20 లక్షలే

లైంగిక దాడి కేసులో యువకుడికి పదేళ్ల జైలు

284 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు