ఎండలు మండిపోతున్నాయి... తీవ్రమైన వేడికి జనం అల్లాడిపోతున్నారు. బయటికెళ్ళడం మాట దేవుడెరుగు, ఇంట్లో ఉండాలంటే కూడా ఉక్కపోతతో చిర్రెత్తిపోతోంది. ఈ రేంజ్ లో ఎండలుంటే... ఒక చిల్డ్ బీర్ తాగాలని మందు అలవాటున్న ప్రతి మద్యం ప్రియుడు అనుకుంటాడు. అలా నిర్మల్ జిల్లాలో ఓ మద్యం ప్రియుడు చిల్డ్ బీర్ తాగాలని బార్ కి వెళ్తే... అందులో చెత్త చూసి దిమ్మతిరిగి పోయింది. ఆదివారం ( మే 24 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని లక్ష్మీనరసింహ బార్ అండ్ రెస్టారెంట్ లో బీర్ తాగడానికి వెళ్ళాడు ఓ మద్యం ప్రియుడు. స్ట్రాంగ్ బీర్ ఎమ్మార్పీ రూ. 190 ఉంటే బార్ లో రూ.210 పెట్టి కొన్న మద్యం ప్రియుడు అవాక్కయ్యాడు. చిల్డ్ బీర్ తాగి రిలాక్స్ అవుదామనుకున్న ఆ మందుబాబుకు బీర్ బాటిల్లో చెత్త చూడగానే మైండ్ బ్లాక్ అయ్యింది.
ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్ పెట్టి కొంటే బీర్ బాటిల్లో చెత్త వచ్చిందేంటని బార్ యజమానిని ప్రశ్నించగా పోతన లేని సమాధానం చెప్పాడని...బార్ లో కూడా కల్తీ సరుకు అమ్ముతూ మందు బాబుల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు.
