హైదరాబాద్: ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నర్సింహా రావు ప్రవచనాలు చాలా సంతృప్తిని కలిగిస్తాయని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం (జనవరి 22) శ్రీ వాసవి ఆర్ట్స్, అవొపా హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత సాహిత్యాల సాంత్వన కార్యక్రమంలో మంత్రి వివేక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహా సహస్రావధాని, పద్మశ్రీ పురస్కార గ్రహిత గరికపాటి నర్సింహా రావు పాల్గొని ప్రవచనాలు శ్రవణం చేశారు.
చిన్నారుల నృత్యాలు కూడా ఈ కార్యక్రమంలో అలరించాయి. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. పాపం లేదు పుణ్యం లేదంటూ ప్రజలకు జ్ఞానం కల్పించిన గరికపాటికి అభినందనలు తెలిపారు. దేశ వ్యాప్తంగా గరికపాటి ప్రవచనాలు ఎంతో మందిని చైతన్య పరిచాయని అన్నారు. రామాయణంతో కూడిన ప్రవచనాలు ప్రజలకు ఆత్మ స్థైర్యం నింపుతాయని పేర్కొన్నారు.
