మరి వరల్డ్ కప్ ఫైనల్లో అన్ని రన్స్ ఎలా చేశా: గౌతీ
న్యూఢిల్లీ: గౌతమ్ గంభీర్ నిరాశావాదని, నెగిటివ్ మైండెడ్ అంటూ ‘ది బేర్ఫుట్ కోచ్’ అనే పుస్తకంలో ప్యాడీ అప్టన్ వ్యాఖ్యలు చేయగా.. తాను అలాంటివాడేనైతే తీవ్ర ఒత్తిడి మధ్య 2011 వరల్డ్కప్ ఫైనల్లో ఎలా రాణించానని గౌతీ కౌంటరిచ్చాడు. 2008–11 మధ్యలో టీమిండియాకు మెంటల్ కడీషనింగ్ కోచ్గా పని చేసిన ప్యాడీ అప్టన్ గంభీర్ మానసికంగా అందరికంటే బలహీనుడుని, నిరాశవాదని, నెగిటివ్ మైండెడ్ అని అప్టన్ రాశాడు. ప్యాడీ మాటలపై తనకు కోపం లేదన్న గంభీర్ .. పరిస్థితిని తాను చూసే విధానం వేరన్నాడు. తాను గొప్ప ఆటగాడిగా, టీమిండియా ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుగా ఎదగాలనే తపన తనలో ఉండేదని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఆ తపన వల్లే సెంచరీ చేసినా సరే డబుల్ సెంచరీ చేయలేకపోయానే అని బాధపడేవాడినని గౌతీ తెలిపాడు. కెరీర్లో చిన్నప్పుడు నుంచే ఎన్నోసార్లు తిరస్కరణకు గురైనా, మానసికంగా బలంగా ఉండడం వల్లే జాతీయ జట్టుకు సేవలందించానని గౌతమ్ పేర్కొన్నాడు.