హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో క్యూర్ పరిధి వెలుపల ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో రూ.4 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మున్సిపల్ శాఖ కమిషనర్ శ్రీదేవి తెలిపారు. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
మొత్తం నిధుల్లో రూ.2,800 కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి సమకూరనున్నాయని పేర్కొన్నారు. పట్టణ మౌలిక సదుపాయాలు, పురపాలక సేవల అభివృద్ధిలో భాగంగా నీటి సరఫరా, మురుగునీటి పారుదల, వర్షపు నీటి నిర్వహణ, పట్టణ రవాణా, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం పెంపు వంటి కార్యక్రమాలకు ఈ నిధులు వినియోగించనున్నట్లు తెలిపారు.
