
నాటింగ్‌హామ్: వెస్టిండీస్ స్టార్ ప్లేయర్లు క్రిస్ గేల్, ఆండ్రీ రసెల్ ఫిట్‌నెస్‌పై ఆ జట్టు కెప్టెన్ జేసన్ హోల్డర్ ఆందోళన వ్యక్తం చేశాడు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్ సందర్భంగా వికెట్ల మధ్య రన్నింగ్ చేయడంలో గేల్ ఇబ్బంది పడ్డాడు. అలాగే, ఔటైన తర్వాత పెవిలియన్ వైపు నడుస్తుండగా ఇబ్బందిగా కనిపించాడు. మరోవైపు షార్ట్ పిచ్ బంతులతో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించిన ఆండ్రీ రసెల్ మోకాలికి గాయమైంది. ఆసీస్‌తో మ్యాచ్‌కు మరో ఐదు రోజుల సమయం ఉన్నందున ఈ టైమ్‌లో గేల్, రసెల్ పూర్తి ఫిట్‌నెస్ సాధించగలరని హోల్డర్ విశ్వాసం వ్యక్తం చేశాడు.