రామగుండం ఎన్టీపీసీలో ‘జెమ్- 2026’

రామగుండం ఎన్టీపీసీలో ‘జెమ్- 2026’

జ్యోతినగర్, వెలుగు: సామాజిక బాధ్యతలో భాగంగా సమీప గ్రామాల బాలికల భవిష్యత్తుకు దారి చూపే గర్ల్ ఎంపవర్‌‌‌‌మెంట్ మిషన్(జెమ్)–2026 కార్యక్రమాన్ని ఎన్టీపీసీ రామగుండంలో మంగళవారం ప్రారంభించారు. స్థానిక కాకతీయ ఫంక్షన్ హాల్‌‌‌‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ అతిథిగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల్లోని సృజనాత్మకతను వెలికితీసి, వారిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమన్నారు. కొత్తగా ఎంపికైన బాలికలకు స్టడీ కిట్లు అందజేశారు. 2019 బ్యాచ్ విద్యార్థినుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బాలభవన్ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జీఎంలు, 
ఉన్నతాధికారులు పాల్గొన్నారు.