మొబైల్ టాయిలెట్లకు రిపేర్లు చేయించండి: GHMC కమిషనర్ కర్ణన్

మొబైల్ టాయిలెట్లకు రిపేర్లు చేయించండి: GHMC  కమిషనర్ కర్ణన్

హైదరాబాద్​ సిటీ, వెలుగు: మొబైల్ టాయిలెట్ వెహికల్స్​ను రిపేర్ చేయించి వినియోగంలోకి తీసుకురావాలని బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం కవాడిగూడ, ఖైరతాబాద్ లోని జీహెచ్ఎంసీ వాహనాల రిపేర్ల షెడ్​ను ఆయన పరిశీలించారు. కవాడిగూడలో రిపేర్లకి వచ్చి ఖాళీగా ఉన్న మొబైల్ టాయిలెట్లను చూసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వెంట అడిషనల్ కమిషనర్  రఘు ప్రసాద్, జోనల్ కమీషనర్ రవి కిరణ్ పాల్గొన్నారు.