హైదరాబాద్, వెలుగు: జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్‌ఐఏఎల్) తెలంగాణ ప్రభుత్వానికి సుమారు రూ. 12.28 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను బదిలీ చేసినట్లు ప్రకటించింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ తెలంగాణ ప్రభుత్వానికి రూ. 36.85 కోట్ల డివిడెండ్‌ను సంస్థ పంపిణీ చేసింది. దీంతో 2025–26 ఆర్థిక సంవత్సరానికి జీహెచ్‌ఐఏఎల్ ప్రకటించిన మొత్తం డివిడెండ్ మొత్తం రూ. 49.14 కోట్లకు చేరింది.
