వాడిన నూనెను మళ్లీ వాడొద్దు... క్యాన్సర్ వచ్చే అవకాశం: ఫుడ్ సేఫ్టీపై స్ట్రీట్ ఫుడ్ వెండర్లకు జీహెచ్ఎంసీ అవగాహన

వాడిన నూనెను మళ్లీ వాడొద్దు... క్యాన్సర్ వచ్చే అవకాశం: ఫుడ్ సేఫ్టీపై స్ట్రీట్ ఫుడ్ వెండర్లకు జీహెచ్ఎంసీ అవగాహన

హైదరాబాద్ సిటీ, వెలుగు:   స్ట్రీట్ ఫుడ్ వెండర్లకు ఫుడ్ సేఫ్టీపై జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో  స్ట్రీట్ ఫుడ్ వెండర్లకు ఫుడ్ తయారీలో పాటించాల్సిన జాగ్రత్తలను అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ మూర్తి రాజు వివరించారు. ఒకసారి వాడిన నూనెను పదే పదే వేడి చేయడం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. 

అది క్యాన్సర్ వంటి వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆహార పదార్థాల్లో వాడే సింథటిట్ కలర్ల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను తెలిపారు. సహజ సిద్ధమైన రంగులను లేదా అనుమతించబడిన పరిమితుల్లోనే వాడాలని సూచించారు. ఆహారం తయారు చేసేటప్పుడు, వడ్డించేటప్పుడు చేతులకు గ్లౌజులు, తలకు క్యాపులు ధరించాలన్నారు.