హైదరాబాద్ సిటీ, వెలుగు:శంషాబాద్లో సెన్సెస్ ప్రక్రియను క్యూర్ పరిధి ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ శుక్రవారం తనిఖీ చేశారు. ఎన్యూమరేటర్లు, సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కచ్చితమైన డేటా సేకరించాలని, ప్రతి ఇంటిని తప్పకుండా కవర్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
ప్రక్రియ మొత్తాన్ని జూన్ 9 లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సెన్సెస్ సిబ్బందికి బిల్ కలెక్టర్లు, టాక్స్ ఇన్స్పెక్టర్లను అనుసంధానం చేయాలని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. వెంట ఎన్నికల విభాగం అడిషనల్కమిషనర్ చంద్రకళ, శంషాబాద్ డీసీ సుమన్ రావు ఉన్నారు.
