ఐటీ కారిడార్​లో అభివృద్ధి పనుల పరిశీలన

ఐటీ కారిడార్​లో అభివృద్ధి పనుల పరిశీలన

గచ్చిబౌలి, వెలుగు: జీహెచ్ఎంసీ కమిషనర్​ఇలంబరితి, హెచ్ఎండీఏ కమిషనర్​సర్ఫరాజ్ అహ్మద్, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్​సీపీ జోయస్ డేవిస్ మంగళవారం ఐటీ కారిడార్​లో పర్యటించారు. ఐఐఐటీ జంక్షన్, గచ్చిబౌలి జంక్షన్, రాడిసన్ హోటల్​జంక్షన్లలో చేపడుతున్న బ్యూటిఫికేషన్ పనులను పరిశీలించారు. 

ఐఐఐటీ జంక్షన్ వద్ద హెచ్-సిటీ ప్రాజెక్టులో భాగంగా నిర్మించబోయే ఫ్లైఓవర్ పనులపై ప్రాజెక్ట్స్ సీఈ భాస్కర్ రెడ్డి, అధికారులతో సమీక్షించారు. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి బ్యూటిఫికేషన్​పనులను వివరించారు. ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణానికి ఆస్తుల సేకరణ, ట్రాఫిక్ ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలన్నారు.