ఫ్లయింగ్ స్క్వాడ్స్ అలర్ట్​గా ఉండాలి : ఎంసీసీ నోడల్ అధికారి

ఫ్లయింగ్ స్క్వాడ్స్ అలర్ట్​గా ఉండాలి : ఎంసీసీ నోడల్ అధికారి
  • ఫ్లయింగ్ స్క్వాడ్స్ అలర్ట్​గా ఉండాలి     
  • అక్రమంగా డబ్బు, మద్యం సప్లయ్​పై నిఘా పెట్టాలి
  • ఎంసీసీ నోడల్ అధికారి, బల్దియా ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు : ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అలర్ట్​గా ఉండాలని, వారిని జీపీఎస్ ట్రాక్ సిస్టం ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని ఎంసీసీ(మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) నోడల్ అధికారి, జీహెచ్ఎంసీ ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో బుధవారం హైదరాబాద్ జిల్లాలోని 15 సెగ్మెంట్లకు చెందిన ఫ్లయింగ్ స్క్వాడ్, వీడియో సర్వేలెన్స్ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు ప్రకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి  ఆధ్యర్యంలో శిక్షణ కార్యక్రమం జరిగింది.  ఈ సందర్భంగా ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ...  చెకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా మద్యం  తదితర వస్తువులు పట్టుబడితే  ఫ్లయింగ్ స్క్వాడ్,  సర్వేలెన్స్ టీమ్స్ వీడియో రికార్డ్ తప్పనిసరిగా చేయాలని తెలిపారు.

ఎలాంటి సంఘటనలు జరిగినా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. 9వ తేదీ నుంచే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చిందన్నారు. ఎంసీసీ, ఎఫ్ఎస్టీవీఎస్టీలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లఘించిన వారిపై తీసుకున్న చర్యలకు సంబంధించి రోజువారీ నివేదిక అందించాలని పేర్కొన్నారు.  పార్టీల మీటింగ్స్, బ్యానర్లు తదితరాలను వీడియో సర్వేలెన్స్ టీమ్​లు రికార్డు చేయాలని ఆదేశించారు. ఫ్లయింగ్ స్కాడ్ టీమ్ లు సీజ్ చేసిన డబ్బును కోర్టుకు సమర్పించాలన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు కాని డబ్బును డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ సెల్(డీజీసీ హైదరాబాద్ కలెక్టరేట్) కు సమర్పించాలని తెలిపారు. ప్రభుత్వ వాహనాలను కూడా చెక్ చేసే అధికారం ఉన్నదని స్క్వాడ్స్ కు ఉంటుందన్నారు.  

అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చును చూపించకపోతే సెక్షన్ 10ఎ కింద డిస్మిస్ చేసే అవకాశం ఉందని నోడల్ అధికారి శరత్ చంద్ర తెలిపారు.  అకౌంటింగ్ టీమ్ లు ప్రత్యేకంగా ఎస్ వోఆర్ (షాడో ఆఫ్ రిజిస్టర్) ఎఫ్.సీ(ఎవిడెన్స్) ఎప్పుటికప్పుడు పొందుపరుస్తారని తెలిపారు.  సీ -విజిల్ యాప్ లో సిటిజన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోటో,  వీడియో, ఆడియో ద్వారా తమ ఫిర్యాదులను తెలపవచ్చని తెలిపారు. ఈ యాప్ ద్వారా అందిన ఫిర్యాదులకు వంద నిమిషాలలోపు సమాధానం ఇవ్వాలని, ఫిర్యాదు అందిన 15 నిమిషాల లోపు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ ఆ ప్రదేశానికి చేరుకొని 30 నిమిషాలలోపు రిపోర్టును ఆర్వో కు అందించాలని తెలిపారు.  ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ లు సి- విజిల్ ఇన్వెస్ట్ గేటర్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఫ్లయింగ్ స్క్వాడ్, వీడియో సర్వేలెన్స్ టీమ్స్, అధికారులు పాల్గొన్నారు.