
హైదరాబాద్ సిటీలో రోజూ ఛాయ్.. టీ సేల్స్ లక్షల్లో ఉంటాయి.. టీ అలవాటు ఉన్నోళ్లు రోజుకు కనీసం ఒకటి నుంచి రెండు తాగుతారు.. దోస్తులు కలిసినా ఛాయ్.. బోరు కొట్టినా ఛాయ్.. ఆఫీస్ వర్క్ లో ఛాయ్.. టెన్షన్ లో ఛాయ్.. రిలాక్స్ లో ఉంటే ఛాయ్.. వెదర్ బాగున్నా ఛాయ్.. వెదర్ బాగోలేకున్నా ఛాయ్.. మూడ్ బాగున్నా ఛాయ్.. మూడ్ బాగోలేకున్నా ఛాయ్.. టీ జీవితంలో వెరీ వెరీ కామన్. అలాంటి టీ స్టాల్స్, టీ సెంటర్లు గల్లీ గల్లీలో ఉంటాయి హైదరాబాద్ సిటీలో.. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఫస్ట్ టైం హైదరాబాద్ ఫుడ్ సెఫ్టీ అధికారులు.. టీ స్టాల్స్.. టీ సెంటర్లలో తనిఖీలు చేశారు.
జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు వీక్లీ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా టీ కొట్లు, టీ పొడి అమ్మే సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. గురువారం (సెప్టెంబర్ 04) నిర్వహించిన తనిఖీల్లో షాకింగ్ అంశాలను బయటపెట్టారు అధికారులు. సిటీలోని మొత్తం 42 టీ పౌడర్ యూనిట్లతో పాటు టీ పాయింట్స్ లలో కూడా తనిఖీలు చేశారు.
తనిఖీల్లో భాగంగా 19 శాంపిల్స్ ను స్టేట్ ఫుడ్ ల్యాబ్స్ కు టెస్టులకు పంపించారు. హైజీన్, సేఫ్టీ స్టాండర్స్ ను ఉల్లంఘించి వ్యాపారులు టీ పౌడర్ అమ్ముతున్నట్లు గుర్తించారు. టీ పౌడర్ అసలుదా, నకిలీదా అనేది గుర్తించలేని విధంగా టీ పౌడర్ తయారు చేస్తూ ప్రజలను మోసగిస్తున్నట్లు గుర్తించారు. పూర్తి స్థాయి రిపోర్టులు వచ్చిన వెంటనే మోసకారి వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు.
టీ పొడి కల్తీనా.. ఒరిజినలా ఇలా కనిపెట్టండి:
టీ పౌడర్ ను చాలా తెలివిగా కల్తీ చేస్తున్నారు వ్యాపారులు. సేమ్ కలర్.. సేమ్ ఫ్లేవర్.. ఉండేలా ఎలాంటి డౌట్ రాకుండా మిక్సింగ్ చేస్తూ జనాలను బోల్తా కొట్టిస్తున్నారు. కల్తీ తెలియకుండా ఉండేందుకు ఆర్టిఫిషియల్ స్మెల్ ఏజెంట్లు వినియోగిస్తున్నట్లు గుర్తించారు జీహెచ్ఎంసీ అధికారులు.
అయితే టీ పౌడర్ అసల దేదో.. కల్తీ దేదో గుర్తించేందుకు ప్రత్యేక టిప్స్ చెప్పారు అధికారులు. తడి గుడ్డపై టీ పౌడర్ ను రుద్ది తెలుసుకోవచ్చునని తెలిపారు. కల్తీ పౌడర్ తడి గుడ్డపై రుద్దినప్పుడు పసుపు కలర్ లో మారుతుందని తెలిపారు. ఒరిజనల్ పౌడర్ పసుపు కలర్ రాదని చెప్పారు. అదే విధంగా నీళ్లలో వేసినప్పుడు ప్యూర్ టీ పౌడర్ లైట్ కలర్ వస్తుందని.. కానీ కల్తీ పౌడర్ కలిపిన నీళ్లు వెంటనే డార్క్ రెడ్ కలర్ లోకి మారుతాయని తెలిపారు. ఈ విధంగా టెస్ట్ చేసి టీ పౌడర్ ఒరిజినలా లేక కల్తీదా అని తెలుసుకోవచ్చని సూచించారు.