సుమేధ మృతికి జీహెచ్​ఎంసీ నిర్లక్ష్యమే కారణం

సుమేధ మృతికి జీహెచ్​ఎంసీ నిర్లక్ష్యమే కారణం

పోలీసుల ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్​లో వెల్లడి!

సుమేధ తల్లి, స్థానికుల స్టేట్​మెంట్​ రికార్డ్​

3 కాలనీల్లో ఎక్కడ చూసినా ఓపెన్​గా నాలా

చిన్న వానకే కాలనీల్లో మోకాలు లోతు నీళ్లు

శనివారం మళ్లీ పొంగిన నాలా

హైదరాబాద్‌, వెలుగు: చిన్నారి సుమేధ మృతికి జీహెచ్​ఎంసీ నిర్లక్ష్యమే కారణమని పోలీసుల ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్​లో తేలినట్లు తెలిసింది. ఇండ్ల మధ్య ఓపెన్​గా ఉన్న నాలాకు కనీసం గ్రిల్స్​ కూడా బిగించకపోవడంతోనే తమ బిడ్డ అందులో జారిపడి చనిపోయిందని సుమేధ తల్లి సుకన్య పోలీసులకు స్టేట్​మెంట్​ ఇచ్చారు. సుకన్య స్టేట్‌మెంట్‌ ఆధారంగా నేరేడ్​మెట్​ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా జీహెచ్​ఎంసీ ఆఫీసర్లతో కలిసి నేరేడ్‌మెట్‌ ఇన్‌స్పెక్టర్‌‌ నర్సింహ స్వామి శనివారం ఓపెన్‌ నాలాను పరిశీలించారు. చిన్నారి పడిపోయిన ప్రాంతంలోని నాలా టర్నింగ్‌‌‌‌లో ఎలాంటి సేఫ్టీ మెజర్స్‌‌‌‌ లేవని గుర్తించారు. స్థానికుల స్టేట్‌‌‌‌మెంట్​ రికార్డ్‌‌‌‌ చేశారు. గతంలో జరిగిన ప్రమాదాల వివరాలు తెలుసుకున్నారు.

ఏఈ,ఈడీ బాధ్యులు!               

నాలాపై సేఫ్టీ మెజర్స్‌‌‌‌ లేకపోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఆఫీసర్ల నిర్లక్ష్యం ఉందని తేలితే సెక్షన్‌‌‌‌ 304  పార్ట్‌‌‌‌ 2 ఐపీసీ కింద కేసు నమోదు చేస్తామని ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌ నర్సింహస్వామి చెప్పారు. ఇందులో స్థానిక జీహెచ్‌‌‌‌ఎంసీ ఇంజినీరింగ్​ వింగ్​ ఏఈ, డీఈని బాధ్యులుగా చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత  కేసును సంబంధిత సెక్షన్లకు అనుగుణంగా మార్చుతామని చెప్పారు.

చిట్టి తల్లి ఎంత నరకం అనుభవించిందో..!

సంతోషిమా నగర్​లోని తన ఇంటి నుంచి గురువారం సాయంత్రం ఆడుకునేందుకు సైకిల్​పై బయటకు వచ్చిన 11ఏండ్ల చిన్నారి సుమేధ.. తిరిగి ఇంటికి వస్తుండగా భారీ వర్షానికి పొంగుతున్న ఓపెన్​ నాలా కనిపించక అందులో జారిపడి ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. నాలాలో పడగానే చిన్నారి తలకు బలమైన గాయమైనట్లు పోస్టుమార్టం ప్రిలిమినరీ రిపోర్టులో డాక్టర్లు పేర్కొన్నారు. పాప ఊపిరితిత్తుల్లోకి నీళ్లు చేరడంతో శరీరం ఉబ్బిపోయినట్లు గుర్తించారు. నాలాలో పడగానే చిన్నారి ఎంత నరకం అనుభవించిందోనని స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

మూడు కాలనీల్లో నాలా ఓపెన్​

నేరేడ్​మెట్​లోని సంతోషిమా నగర్,  దీన్​దయాల్​నగర్​, కాకతీయనగర్​లో కాలనీల్లోని ఇండ్ల మధ్య నాలా ఓపెన్​గా ఉంది. అక్కడక్కడ నాలాపై ఏర్పాటు చేసిన బ్రిడ్జికి ఇరువైపులా కూడా ఎలాంటి గ్రిల్స్​ లేవు. చిన్న వాన పడ్డా నాలా పొంగిపొర్లుతుంటుంది. పైనుంచి వచ్చే వరదతో ఈ మూడు కాలనీల్లో  మోకాలు లోతు నీళ్లు వచ్చి చేరుతుంటాయి. దీంతో ఓపెన్​ నాలా కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. భారీ వర్షం కారణంగా మోకాలు లోతు నీళ్లు ఉండటంతో నాలా కనిపించకనే సుమేధ అందులో జారి పడిపోయిందని స్థానికులు అన్నారు. స్ట్రీట్​లైట్లు కూడా సరిగ్గా లేవని వారు చెప్పారు. “శుక్రవారం   ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు స్పాట్‌‌‌‌కి వచ్చారు. వచ్చే ఏడాది వరకు నాలాను బాగుచేస్తమన్నరు. లేకపోతే అందులో దూకుతా అన్నరు.  నాలాను రిపేర్​ చేయించడానికి సంవత్సరం ఆగాలా? ఇక్కడ ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నరు. వాళ్లు టీఆర్​ఎస్​ పార్టీ వాళ్లే. కాలనీలో సమస్యలపై అడిగితే మా పరిధిలోకి రాదంటే మా పరిధిలోకి రాదంటూ తప్పించుకుంటున్నరు” అని స్థానికులు  మండిపడ్డారు. నాలాలు, డ్రైనేజీ వ్యవస్థ అస్థవ్యస్తంగా ఉందని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన స్థానిక కార్పొరేటర్లు, జీహెచ్‌‌‌‌ఎంసీ ఆఫీసర్లు  పట్టించుకోలేదని, వాళ్ల నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి సుమేధ చనిపోయిందని వారు అన్నారు.  బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

సుమేధకు కన్నీటి వీడ్కోలు

నాలాలో జారిపడి మృతి చెందిన చిన్నారి సుమేధ అంత్యక్రియలు శనివారం ఉదయం 10 గంటలకు మల్కాజ్​గిరి పటేల్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లోని శ్మశానవాటికలో ముగిశాయి. అంత్యక్రియల్లో బంధువులు, స్థానికులు, వివిధ పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు. కండ్ల ముందు ఆడిపాడిన చిన్నారి ఇక లేదని తెలిసి స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు. సుమేధ కుటుంబానికి రూ. 20 లక్షల ఎక్స్‌‌‌‌గ్రేషియా ప్రకటించాలని, కాలనీవాసులకు రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌‌‌‌ చేయాలని గ్రేటర్‌‌‌‌‌‌‌‌ జనసేన అధ్యక్షుడు రాజలింగం డిమాండ్‌‌‌‌ చేశారు. ఘటన జరిగిన దీన్‌‌‌‌దయాల్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌తో పాటు సంతోషీమా నగర్‌‌‌‌‌‌‌‌, కాకతీయనగర్‌‌‌‌ కాలనీల్లో కనీసం స్ట్రీట్‌‌‌‌ లైట్స్‌‌‌‌ కూడా లేవన్నారు.

మళ్లీ పొంగిన నాలా

ప్రమాదకరంగా మారిన ఓపెన్​ నాలాపై జీహెచ్‌‌ఎంసీ శనివారం టెంపరరీగా జాలీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది.  దీన్‌‌దయాల్‌‌ నగర్‌‌‌‌లోని నాలాకు జాలీలు ఏర్పాటు చేస్తుండగా.. అదే సమయంలో వర్షం పడటంతో నాలా మరోసారి పొంగిపొర్లింది. దీంతో దీన్‌‌దయాల్‌‌నగర్‌‌‌‌తో పాటు కాకతీయనగర్‌‌‌‌ మోకాలు లోతు నీటిలో మునిగిపోయాయి.

జీహెచ్​ఎంసీ కమిషనర్​కు హెచ్చార్సీ నోటీసులు

సుమేధ మృతి, నాలాలు, డ్రైనేజీ వ్యవస్థపై రిపోర్టు ఇవ్వాలని ఆదేశం

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రాణాలు పోతున్నాయని అడ్వకేట్​ పిటిషన్​

మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇచ్చేలా చూడాలని వినతి

జీహెచ్‌‌ఎంసీపై రాష్ట్ర హ్యూమన్​ రైట్స్​ కమిషన్​(హెచ్చార్సీ) సీరియస్‌‌  అయింది. చిన్నారి సుమేధ మృతి, నాలాలు, అండర్‌‌ ‌‌గ్రౌండ్‌‌ డ్రైనేజీ సిస్టమ్‌‌పై రిపోర్ట్​ ఇవ్వాలని జీహెచ్‌‌ఎంసీ కమిషనర్‌‌ లోకేశ్​ కుమార్‌‌‌‌కు శనివారం నోటీసులు జారీ చేసింది.‌‌ ఓపెన్‌‌ నాలాలో పడి కొట్టుకుపోయిన సుమేధ(11) కేసులో పూర్తిస్థాయి విచారణకు ఆదేశించాలని కోరుతూ అడ్వకేట్​ మామిడి వేణుమాధవ్‌‌ హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్​లోని ఓపెన్ నాలాలు ప్రాణాలు తీస్తున్నాయని, ప్రభుత్వం, ఆఫీసర్ల నిర్లక్ష్యం తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తోందని పిటిషన్‌‌లో ఆయన పేర్కొన్నారు. వర్షాకాలంలో ఎన్ని ప్రమాదాలు జరిగినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నాలాలు, డ్రైనేజీల్లో పడి ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ అడ్వకేట్​ మామిడి వేణుమాధవ్​ కోరారు. ఈ పిటిషన్​ను విచారణకు స్వీకరించిన కమిషన్‌‌..  జీహెచ్‌‌ఎంసీ కమిషనర్‌‌‌‌కు నోటీసులు జారీ చేసింది. సుమేధ ఘటనతో పాటు హైదరాబాద్​లోని నాలాలు, అండర్‌‌‌‌గ్రౌండ్‌‌ సిస్టమ్‌‌పై నవంబర్‌‌‌‌ 13లోగా పూర్తి స్థాయి రిపోర్టు అందించాలని హెచ్చార్సీ చైర్మన్‌‌ జస్టిస్‌‌ చంద్రయ్య ఆదేశాలు జారీ చేశారు.

For More News..

యూరప్‌లో కరోనా సెకండ్ వేవ్

సమజైతలే! మొదట్నుంచీ కన్ఫ్యూజ్ ​చేస్తున్న కరోనా