- ఉదయం 99 డేస్ ప్రగతి ప్రణాళిక
- మధ్యాహ్నంలోపే సెన్సస్, ‘సర్’ సర్వే పూర్తి చేయాలి
- లంచ్ తర్వాత ఆఫీసుకు..
- సిబ్బంది లేక అవగాహన లేని వారికీ బల్దియా బాధ్యతలు
- తప్పలు జరుగుతున్నాయంటూ విమర్శలు
మూడు కార్పొరేషన్ల పరిధిలో బల్దియా సిబ్బంది ఒకేసారి మూడు డ్యూటీలు చేయలేక తిప్పలు పడుతున్నారు. 99 డేస్ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక, సెన్సస్, సర్డ్యూటీలు వేస్తుండడంతో దేనికీ న్యాయం చేయలేకపోతున్నారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు 99డేస్ యాక్షన్ ప్లాన్, తర్వాత సెన్సస్, అటు తర్వాత ఎస్ఐఆర్ (సర్) డ్యూటీలు మధ్యాహ్నం వరకు చేస్తూ మానసికంగా, శారీరకంగా వేదనకు గురవుతున్నారు. ఇక్కడితో ఆగిపోకుండా లంచ్ తర్వాత ఆఫీసులకు వెళ్లి రెగ్యులర్డ్యూటీల్లో పాల్గొంటున్నారు. కొందరు అలసి సొలసి ఆఫీసులకు కూడా రావడం లేదు. దీంతో ఈ ప్రభావం రోజువారీ సాధారణ పరిపాలన, పౌర సేవలపై పడుతోంది. సిబ్బంది కొరతతో అవగాహన లేనివారిక డ్యూటీలు అప్పజెప్తుండడంతో సర్, సెన్సస్సర్వేల్లోనూ తప్పులు జరుగుతున్నాయి.
హైదరాబాద్ సిటీ, వెలుగు: జనగనణ(సెన్సస్), స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్), 99 రోజుల యాక్షన్ ప్లాన్ ఇలా ఒకేసారి మూడు కార్యక్రమాలు జరుగుతుండడంతో ఉన్న స్టాఫ్‌కే బల్దియా అదనపు బాధ్యతలు అప్పజెప్తోంది. ఇప్పటికే మూడు కార్పొరేషన్ల పరిధిలో సిబ్బంది, అధికారులు లేక సతమతమవుతుంటే కొత్తగా వచ్చిన సర్, సెన్సస్, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నిర్వహించలేక బల్దియా సతమతమవుతోంది.
క్యూర్పరిధిలో సెన్సస్‌కు, హైదరాబాద్జిల్లా పరిధిలో ‘సర్’కు తగినంత మంది స్టాఫ్ లేక ఉన్నవారికే మూడు డ్యూటీలు అప్పగిస్తోంది. అవగాహన లేని వారికి బాధ్యతలు అప్పగిస్తుండడంతో ఏ పనులు సరిగ్గా సాగడం లేదు. దీనివల్ల ఏ ఒక్కదానికీ న్యాయం జరగడం లేదు. ఉన్నతాధికారులు మాత్రం మూడు కార్యక్రమాలు సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్నాయని చెప్తున్నా గ్రౌండ్ లెవెల్లో వాస్తవం వేరే విధంగా ఉంది.
సెన్సస్‌లో లక్షా 20 వేల కుటుంబాలే
సెన్సస్ కి సంబంధించి ఎంతో హడావిడి చేసినప్పటికీ క్యూర్ పరిధిలో కేవలం లక్షా 20 వేల కుటుంబాల సెల్ఫ్ ఎన్యూమరేషన్ మాత్రమే జరిగింది. బుధవారం నుంచి డోర్ టు డోర్ ఎన్యూమరేషన్ ప్రారంభమైనప్పటికీ ఇది కూడా ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఇక ఎస్ఐఆర్ కి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
అవగాహనలేని వారిని బీఎల్ఓలుగా నియమించడంతో వారు ఏ వివరాలు తీసుకుంటున్నారో ఏ వివరాలు తీసుకోవడం లేదో తెలియడం లేదు. ఓవర్బర్డెన్కావడంతో ఇంటింటికీ వెళ్లకుండానే ఓటరు కార్డులను మ్యాపింగ్ చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానంపై వారికి సరైన అవగాహన లేకపోవడంతో సర్వేల ప్రక్రియలో తప్పులు జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఒకే టైంలో మూడు పనులా?
సెన్సస్, ఎస్ఐఆర్ ఒకవైపు జరుగుతుండగా.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల యాక్షన్ ప్లాన్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కింద రోజుకో యాక్టివిటీ నిర్వహించాల్సి వస్తోంది. రెండు సర్వేలతో పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కత్తి మీద సాములా మారింది. దీంతో 99 డేస్యాక్షన్ప్లాన్కేవలం ఫొటోలకే పరిమితమైందన్న ఆరోపణలు వస్తున్నాయి.
రెండునెలలుగా ఈ కార్యక్రమం జరుగుతున్నా ట్రై కార్పొరేషన్లలో పెద్దగా మార్పు కనిపించడంలేదు. ఈ ప్లాన్‌ను పకడ్బందీగా అమలు చేయాల్సి ఉండగా, సెన్సర్, ఎస్ఐఆర్వల్ల మమ అనిపిస్తున్నారు.
ఎవరిని అడిగినా స్పెషల్ డ్యూటీనే..
జీహెచ్ఎంసీలో అధికారులు, సిబ్బందిని ఇలా ఎవరినడిగినా సెన్సస్, ఎస్ఐఆర్ తో పాటు 99 రోజుల యాక్షన్ ప్లాన్ స్పెషల్ డ్యూటీలో ఉన్నామని చెప్తున్నారు. మూడు ప్రోగ్రామ్స్ఏకకాలంలో జరుగుతుండడంతో ఈ ప్రభావం జీహెచ్ఎంసీలో రోజువారీ సాధారణ పరిపాలన, పౌర సేవలపై పడింది. ఇటు ఆఫీసుల్లో ఫైల్స్ పెండింగ్ లో ఉంటున్నాయి. ప్రజలు ఆఫీసులకు వస్తే సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు.
