- జల్పల్లిలో రూ.5.90 కోట్లతో
- కొత్త సర్కిల్ ఆఫీస్ భవన నిర్మాణం
- జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో 12 అంశాలకు ఆమోదం
హైదరాబాద్ సిటీ, వెలుగు : జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం శుక్రవారం మధ్యాహ్నం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో స్పెషల్ ఆఫీసర్ జయేష్ రంజన్ ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో 12అంశాలకు ఆమోదం తెలిపారు. భవానీ నగర్ మెయిన్ రోడ్డు వద్ద రూ.3.85 కోట్లతో 60 అడుగుల రోడ్డు విస్తరణ, బడా బజార్ జంక్షన్ నుంచి మౌలాకా చిల్లా వరకు రూ.5.99 కోట్లతో 40 అడుగుల రోడ్డు విస్తరణతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు.
యాకుత్‌పురా సర్కిల్ పరిధిలోని బీబీ బజార్ నాలా వద్ద రూ.2.60 కోట్లతో బాక్స్ టైప్ డ్రెయిన్ (డైవర్షన్ నాలా) నిర్మాణం, రాజేంద్రనగర్ పల్లె చెరువు వద్ద రూ.4.67 కోట్లతో వీర్ కమ్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రతిపాదనలున్నాయి. మూసారాంబాగ్‌లో రూ.3.14 కోట్లతో 33 కేవీ అండర్ గ్రౌండ్ కేబుల్ మార్పిడి పనులకు అనుమతి, జల్పల్లిలో రూ.5.90 కోట్లతో కొత్త సర్కిల్ ఆఫీస్ భవన నిర్మాణానికి పర్మిషన్ఇచ్చారు. మైత్రీవనం జంక్షన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠాపన-జంక్షన్ అభివృద్ధి పనుల ప్రతిపాదనలను కమిటీ పరిశీలించనున్నది. గోషామహల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కోసం హిందీ నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో వార్డు ఆఫీసును కేటాయించే అంశంతో పాటు జీహెచ్ఎంసీలో పాత అద్దె వాహనాల స్థానంలో 45 ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోలు చేయాలని నిర్ణయించారు. రాజేంద్రనగర్, హైదర్‌షాకోట్ డివిజన్లలోని పలు కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆమోదం తెలిపారు.
ఎంఎంసీలో 30 అంశాలకు ఆమోదం
తార్నాకలోని ఎంఎంసీ ఆఫీసులో శుక్రవారం స్పెషల్ ఆఫీసర్ జయేష్ రంజన్ ఆధ్వర్యంలో స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో 30 అంశాలపై చర్చించారు. పారిశుధ్యం, డ్రైనేజీలు, రోడ్లు, క్రీడలు ఇతర మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై చర్చించి ఆమోదించారు. ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి, జోనల్ కమిషనర్లు రాధికా గుప్తా, సంచిత్ గంగ్వార్ పాల్గొన్నారు.
