Hyderabad: అందుబాటులోకి GHMC వాట్సాప్ సేవలు.. ఈ నెంబర్కు మెసేజ్ చేస్తే వెంటనే సమస్యల పరిష్కారం !

Hyderabad: అందుబాటులోకి GHMC వాట్సాప్ సేవలు..  ఈ నెంబర్కు మెసేజ్ చేస్తే వెంటనే సమస్యల పరిష్కారం !

గ్రేటర్ హైదరాబాద్ నగర వాసులకు జీహెచ్ఎంసీ గుడ్ న్యూస్ చెప్పింది. సమస్యల పరిష్కారం కోసం వాట్సాప్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. ఇక నుంచి మై జీహెచ్ఎంసీ యాప్ తో పాటు వాట్సాప్ లో కూడా ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించింది. శుక్రవారం (ఆగస్టు 01) వాట్సాప్ సర్వీసులను ప్రారంభించింది.

చెత్త వ్యర్ధాలు, నిర్మాణ వ్యర్థాలు, గార్బేజ్ బిన్ ఓవర్ ఫ్లో లాంటి సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించింది జీహెచ్ఎంసీ. అందుకోసం 8125966586 నంబర్ కు ఫోటోతో పాటు లొకేషన్ పెడితే చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసి అధికారులు తెలిపారు.

ఇప్పటికే  ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన చెల్లింపులు వాట్సాప్ ద్వారా అవకాశం కల్పించేందుకు కసరత్తు చేస్తోంది జీహెచ్ఎంసీ. ప్రస్తుతం ప్రతి ఏడాది సుమారు రూ.2 వేల కోట్ల మేర ఆస్తిపన్ను వసూలవుతుండగా.. దాంట్లో సగం వరకు ఆన్‌లైన్ పేమెంట్స్ రూపంలో వస్తోంది. గూగుల్ పే, మైజీహెచ్‌ఎంసీ యాప్‌, పేటీఎం, ఇతర యూపీఐ ప్లాట్‌ఫామ్‌లతోపాటు వెబ్‌సైట్‌ ద్వారానే ప్రజలు ట్యాక్స్‌ పే చేస్తున్నారు.

 అయితే ప్రతిసారీ కట్టాల్సిన ట్యాక్స్ లను గుర్తు చేయడానికి జీహెచ్‌ఎంసీ సుమారు 20 లక్షల ఎస్‌ఎంఎస్‌లు పంపాల్సి వస్తోంది. ఆ మెసేజ్‌లు పంపేందుకు పెద్ద మొత్తంలో ఖర్చువుతోంది. ప్రతి 1,000 మెసేజ్‌లకు సగటున రూ.52 ఖర్చవుతోంది. ఈ ఖర్చును తగ్గించేకందుకు తగ్గించేందుకు, వాట్సప్ బిజినెస్ అకౌంట్ ద్వారా పేమెంట్స్ చేపట్టాలనేప్లాన్ లో ఉంది. అదే విధంగా గ్యార్బేజ్ ఇతర కంప్లయింట్లకు సంబంధించిన సేవల కోసం వాట్సాప్ సదుపాయం కల్పించడం గమనార్హం.