రామచందర్ రావు రబ్బర్ స్టాంపు.. బీజేపీని డమ్మీ చేసే కుట్ర: రాజాసింగ్

రామచందర్ రావు రబ్బర్ స్టాంపు.. బీజేపీని డమ్మీ చేసే కుట్ర: రాజాసింగ్

బీజేపీని సర్వనాశనం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు గోషామహల్ ఎమ్మెల్యే  రాజాసింగ్. అసలైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి అన్యాయం జరుగుతోందన్నారు.  పార్టీలో నా మనిషి, నీ మనిషి అనే రాజకీయం నడుస్తోందని వ్యాఖ్యానించారు. కొత్త కమిటీలో 12 మంది ఒకే పార్లమెంటు సెగ్మెంట్ వాళ్లు ఉన్నారని చెప్పారు రాజాసింగ్.  రాష్ట్ర కమిటీని కిషన్ రెడ్డి వేశారా? లేక రామచందర్ రావు వేశారా అని ప్రశ్నించారు.  రామచందర్ రావు మంచి వ్యక్తే కానీ..రబ్బర్ స్టాంప్ అని అన్నారు.  ఈ ప్లానింగ్ అంతా కిషన్ రెడ్డిదేనని విమర్శించారు రాజాసింగ్.

కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే తాను కూడా చేస్తానని అన్నారు రాజాసింగ్. కిషన్ రెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి. నేనూ చేస్తా..ఎవరు గెలుస్తారో చూసుకుందాం అని సవాల్ విసిరారు.  రాజాసింగ్ ఎప్పుడైనా ఏక్ నిరంజన్ అని..తన వెనుక ఎవరూ లేరన్నారు .రాజీనామా చేయనని ఏం చేసుకుంటారో చేసుకోండని వ్యాఖ్యానించారు రాజాసింగ్. అధికారంలోకి వచ్చే పార్టీని పండబెట్టారని వ్యాఖ్యానించారు రాజాసింగ్ . ఇపుడు ఏ కార్యకర్త పనిచేయడానికి ఇష్టపడటం లేదన్నారు.  

తనపై పోస్టులు పెట్టిన వ్యక్తి ఎక్కడుంటాడో చూసుకోవాలని హితవు పలికారు.  తన గురించి విమర్శించే వాళ్లు వాళ్ల గురించి ఆలోచించుకోవాలని సూచించారు రాజాసింగ్.  తన మీద విమర్శలు చేసే అర్హత ప్రధాన కార్యదర్శి అశోక్ కు లేదన్నారు. గతంలో ఏబీవీపీ కార్యకర్తలపై కేసులు పెట్టిచ్చిన చరిత్ర అశోక్ దని చెప్పారు.నెలకు డబ్బులిచ్చి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తల గొంతుకగా తాను మాట్లాడుతున్నానని చెప్పారు రాజాసింగ్.