ఫిర్జాదిగూడ గురుకుల పాఠశాలలో బాలిక అనుమానాస్పద మృతి

ఫిర్జాదిగూడ గురుకుల పాఠశాలలో బాలిక అనుమానాస్పద మృతి

మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిర్జాదిగూడ గురుకుల పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న అనిత అనే బాలిక అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపురం గ్రామానికి చెందిన అనిత సమ్మర్ హాలిడేస్ తర్వాత రెండు రోజుల క్రితమే హాస్టల్ కు వచ్చింది. అయితే గురుకుల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ పాప చనిపోయిందని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. .తమ పాప ఫుడ్ పాయిజన్ తో చనిపోయిందని.. ప్రభుత్వం  ఆదుకోవాలని కోరారు. ఆరోగ్యంగా ఉన్న పాపకి హార్ట్ అటాక్, ఫిట్స్ వచ్చాయని గురుకుల సిబ్బంది చెప్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.