
పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆస్పత్రికి వచ్చిన ఓ బాలిక కనిపించకుండా పోయింది. చిలకలగూడ ఎస్సై కిశోర్ తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్‌లోని మదీనాగూడకు చెందిన కె. సాయిపూజ(14)ను ఈ నెల 18న అమీర్ పేటలోని స్టేట్ హోం బ్రాంచ్ నుంచి గాంధీ ఆస్పత్రికి ఎస్కార్ట్‌తో తీసుకొచ్చారు. అదే రోజు సాయిపూజ ఆస్పత్రి నుంచి తప్పించుకుంది.
ఎక్కడ వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో స్టేట్ హోం ఎంప్లాయ్ ప్రవీణ బుధవారం చిలకలగూడ పీఎస్‌లో కంప్లయింట్ చేసింది. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాయిపూజను ఎవరైనా గుర్తు పడితే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.గాయాలతో అడ్మిట్ అయిన పేషెంట్ మిస్సింగ్ గాంధీ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఓ పేషెంట్ కనిపించకుండాపోయాడు.
ఎస్సై కిశోర్ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డికి చెందిన మన్నె సురేశ్.. యాక్సిడెంట్ గాయాలతో గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ అయి చికిత్స పొందుతున్నాడు. గత నెల 29న సహాయకులతో కలిసి వార్డు నుంచి బయటికి వచ్చిన కనిపించకుండా పోయాడు. ఎక్కడా వెతికినా సురేశ్ ఆచూకీ దొరకలేదని అతడి భార్య సుమలత బుధవారం చిలకలగూడ పీఎస్‌లో కంప్లయింట్ చేసింది.