దేశముదురు లవర్స్ : రాత్రిపూట కలుసుకోవడానికి రోజూ ఊళ్లో కరెంట్ కట్ చేస్తున్రు

దేశముదురు లవర్స్ : రాత్రిపూట కలుసుకోవడానికి రోజూ ఊళ్లో కరెంట్ కట్ చేస్తున్రు

వారిద్దరూ లవర్స్..డీప్ లవ్ లో ఉన్నారు.  ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. ఇద్దరు  ఒకే గ్రామానికి చెందడంతో కలుసుకోవడానికి ఇబ్బందిగా ఉండేది. దీంతో  ప్రియుడిని రహస్యంగా కలుసుకునేందుకు ప్రియురాలు పెద్ద ప్లానే వేసింది.  పగలు కనిపిస్తే అందరికి అనుమానం వస్తుందని రాత్రిపూట కలుసుకోవాలని అనుకుంది. 

ప్రియుడ్ని కలుసుకునేందుకు తన  గ్రామంలో రాత్రిపూట ట్రాన్స్‌ఫార్మరు వద్దకు వెళ్లి కరెంట్ కట్ చేయడం మొదలుపెట్టింది.  ఇలా కొన్ని రోజులు గడిచిపోయింది.  కానీ అన్ని  రోజులు మనవి కాదు కదా.. గ్రామంలో రాత్రిపూట ఒకే సమయంలో కరెంట్ కట్అవుతుండటం, అదే సమయంలో రెండు బైక్‌లు, కరెంట్‌ మోటార్లు, పలు మేకలు కనిపించకుండా పోవడంతో  గ్రామస్థులకు అనుమానం వచ్చింది. దీంతో ఊళ్లో కొందరు గ్రామస్థులు  మాటు వేసి వారిని పట్టుకున్నారు. 

ప్రియుడితో కలిసి ఏకాంతంలో ఉన్న ప్రియురాలిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని, ఆమె ప్రియుడికి దేహశుద్ధి చేశారు. ఈ తతంగాన్నంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట చేయగా అదికాస్తా వైరల్ గా మారింది.ఈ ఘటనపై పోలీసులు జోక్యం చేసుకొని.. కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రేమ జంట పెళ్లి జరిపించారు.