- వెస్ట్రన్ దేశాలు జప్తు చేస్తాయనే భయం
న్యూఢిల్లీ: గ్లోబల్ బ్యాంకుల్లో నిల్వ ఉంచిన బంగారాన్ని ఇండియా వెనక్కి తెచ్చుకుంటోంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా రిజర్వ్‌లను వెస్ట్రన్ దేశాలు జప్తు చేయడం, అఫ్గానిస్తాన్ రిజర్వ్‌లను బ్లాక్ చేయడంతో మన బంగారం మన దగ్గర ఉంటేనే బెటర్ అని భావిస్తోంది. ప్రస్తుతం మన గోల్డ్ నిల్వలు 880.52 మెట్రిక్ టన్నులు కాగా, ఇందులో 680 టన్నులు మన దగ్గరనే ఉన్నాయి. అంటే 77 శాతం బంగారం ఇండియాలో స్టోర్ అయి ఉంది.
ఆర్‌బీఐ రిపోర్ట్ ప్రకారం, గత ఆరు నెలల్లోనే 104.23 టన్నుల గోల్డ్ వెనక్కొచ్చింది. మిగిలిన 197.67 మెట్రిక్ టన్నుల బంగారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్ (బీఐఎస్) వద్ద ఉంది. దీనిని ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ల సెటిల్‌మెంట్ కోసం స్టోర్ చేయనుంది. కాగా, 2013 టైమ్‌లో సుమారు 11 శాతం మాత్రమే లోకల్‌గా నిల్వ ఉండేది. 2009లో ఐఎంఎఫ్ నుంచి ఒక్కసారిగా 200 టన్నులు బంగారం కొనడంతో ఇండియా గోల్డ్ నిల్వలు 2013 నాటికి 557.75 టన్నులకు చేరాయి. 2026 నాటికి 323 టన్నులు పెరిగాయి. 2018 లో మొదటిసారిగా విదేశాల్లోని గోల్డ్‌ను ఇండియాకు తీసుకురావడం మొదలైంది.
గ్లోబల్ ట్రెండ్..
ఫ్రాన్స్ కూడా 129 టన్నుల గోల్డ్‌ను న్యూయార్క్ నుంచి పారిస్‌కి మార్చింది. జర్మనీ వద్ద 3,352 టన్నులు ఉండగా, ఇందులో మూడో వంతు ఇంకా న్యూయార్క్‌లో ఉంది. కానీ 2014–17లో 300 టన్నులను వెనక్కి తెచ్చుకుంది.
