చిన్న, మధ్యతరహా లోన్లకు ప్రయారిటీ ఇవ్వండి...కలెక్టర్ హరిచందన

చిన్న, మధ్యతరహా లోన్లకు ప్రయారిటీ ఇవ్వండి...కలెక్టర్ హరిచందన

హైదరాబాద్ సిటీ, వెలుగు: చిన్న, మధ్యతరహా లోన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ హరిచందన బ్యాంక్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన డీసీసీ, డీఎల్ఆర్సీ మీటింగులో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటు ఎడ్యుకేషన్​లోన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన స్కీం గురించి మత్స్యకారులకు అవగాహన కల్పించాలని, పీఎం విశ్వకర్మ , ముద్ర, స్టాండ్ అప్ ఇండియా లోన్లు ఎక్కువగా ఇవ్వాలన్నారు. ఎల్డీవో ఆర్బీఐ లక్ష్మి శ్రావ్య, డీడియం నాబార్డ్  హర్ష రఘురాం, ఎల్​డీఎం నరసింహ మూర్తి పాల్గొన్నారు.