ఫంక్షన్లకు పోయి కరోనా అంటించుకుంటున్నరు

ఫంక్షన్లకు పోయి కరోనా అంటించుకుంటున్నరు

శ్రావణం లగ్గాలతో పల్లెల్లో పెరిగిన పాజిటివ్ కేసులు

పింఛన్లకు వెళ్లిన చోటా ఒకరి నుంచి మరొకరికి వైరస్

మాస్కులు, ఫిజికల్ డిస్టెన్స్ లేకనే ఎక్కువ మందికి వ్యాప్తి

ఊళ్లకు ఊళ్లే క్వారంటైన్

ఈ టైంలో నిర్లక్ష్యం వద్దంటున్న డాక్టర్లు

నెట్​వర్క్​, వెలుగు: శ్రావణమాసంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరిగిన పెళ్లిళ్లు, ఫంక్షన్లతో కరోనా మరోసారి విజృంభించింది. జులై 23 నుంచి ప్రారంభమైన శుభ ముహూర్తాలు ఆగస్టు 14దాకా కొనసాగాయి. ఈ టైంలో వేలాది మంది పెండ్లి చేసుకున్నారు. ఈ పెళ్లిళ్ల సందర్భంగా పట్టణాల్లో కరోనా రూల్స్ కొం తవరకు పాటించినా పల్లెల్లో నిర్లక్ష్యం చేశారు. ఒక్కో ఫంక్షన్ కు వందల్లో జనం రావడం, మాస్కులు పెట్టు కోకపోవడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటించకపోవడం లాంటి కారణాలతో పల్లె జనాలు కరోనా బారిన పడ్డారు. ఇటీవల జిల్లాల్లోని రూరల్ ఏరియాల్లో వెలుగుచూస్తున్న కేసులే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ఊళ్లకు ఊళ్లే క్వారంటైన్..

పెళ్లిళ్లు, ఫంక్షన్ల దెబ్బకు ఊళ్లకు ఊళ్లే క్వారంటైన్ కు వెళ్తున్నాయి. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం చాగల్ లో శ్రావణ మాసంలో నాలుగు పెళ్లిళ్లు జరిగాయి. దీంతో గడిచిన 10 రోజుల్లో ఊళ్లోని 53 మందికి కరోనా వచ్చింది. 5వేల జనాభా ఉన్న ఆ ఊరు ఇప్పుడు సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లింది. జమ్మికుంట మండలం వెంకటేశ్వర్లపల్లి శివారు గోవిందాపూర్ లో కొద్దిరోజుల క్రితం ఓ పెండ్లి జరిగింది. 350 మంది ఉన్న ఈ గ్రామంలో ఇప్పడు ఏకంగా 73 మంది కరోనా బారిన పడ్డారు. ఇలా పెండ్లిళ్లే కాదు, ఇతరత్రా ఫంక్షన్ల ద్వారా కూడా కరోనా స్ప్రెడ్ అవుతోంది. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి దశదిన కర్మ అనంతరం ఆయన స్వగ్రామమైన చిట్టాపూర్‌‌‌‌లో కరోనా పాజిటివ్‌‌ ‌‌కేసుల సంఖ్య బాగా పెరిగింది. ఆ ఫంక్షన్ కు హాజరైన 330 మందికి టెస్టులు చేస్తే ఏకంగా 72 మందికి పాజిటివ్ అని తేలింది.

. జులై 23 నుంచి ప్రారంభమైన శుభ ముహూర్తాలు ఆగస్టు 14దాకా కొనసాగాయి. ఈ టైంలో వేలాది మంది పెండ్లి చేసుకున్నారు. ఈ పెళ్లిళ్ల సందర్భంగా పట్టణాల్లో కరోనా రూల్స్ కొంత వరకు పాటించినా పల్లెల్లో నిర్లక్ష్యం చేశారు. ఒక్కో ఫంక్షన్ కు వందల్లో జనం రావడం, మాస్కులు పెట్టు కోకపోవడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటించకపోవడం లాంటి కారణాలతో పల్లె జనాలు కరోనా బారిన పడ్డారు. ఇటీవల జిల్లాల్లోని రూరల్ ఏరియాల్లో వెలుగుచూస్తున్న కేసులే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం ఆరేపల్లి, వాడి, భిక్కనూరు, పిట్లం , రాజంపేట గ్రామాల్లో వివిధ ఫంక్షన్ల కారణంగా ఏకంగా 234 కేసులు నమోదయ్యాయి.

ఖమ్మం జిల్లాలో గడిచిన మూడు రోజులుగా నిత్యం 500కు తగ్గకుండా కేసులు వస్తున్నాయి. మొదట్లో అర్బన్ ఏరియాల్లోనే ఎక్కువ కేసులు వచ్చినా వారం నుంచి రూరల్ వాటా పెరిగింది. ప్రస్తుతం గ్రామాల్లో40 శాతానికి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజరు గ్రామంలో 30, పెనుబల్లి వియంబంజారులో 50 కేసులు వచ్చాయి.

వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం పంగిడి పల్లిలో ఈ నెల 25 వరకు కేవలం 25 కేసులు మాత్రమే ఉన్నాయి. 26, 27 తేదీల్లో శాంపిల్స్ తీసుకోగా ఏకంగా 42 కేసులు నమోదయ్యా యి. ఇలా ఏ జిల్లాలో చూసినా కుప్పలుతెప్పలుగా కేసులు వస్తున్నాయి.

మాస్కులు పెడ్తలేరు.. దూరం ఉంటలేరు..

వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని కొత్తపల్లి గ్రామంలోని గుడిలో ఇటీవల పూజల అనంతరం ఊరంతా కలిసి భోజనాలు చేశారు. ఎవరూ కరోనా రూల్స్ పట్టించుకోలేదు. దీంతో ఏకంగా 52 మందికి పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు ఈ గ్రామంలో ఏ ఇంట చూసినా కరోనా పేషెంట్లే కనిపిస్తున్నారు. ఇదే జిల్లా చిన్నంబావి మండలం దగుడ గ్రామంలో పింఛన్ల కోసం వెళ్లిన 92 మంది వృద్ధులు, వికలాంగులు కరోనా బారిన పడ్డారు. చాలా గ్రామాల్లో ప్రజలు కరోనాను లైట్ తీసుకోవడం వల్లే వైరస్ విజృంభిస్తోంది. పెండ్లిండ్లు , ఫంక్షన్లకు 50మందికి మించి పోరాదనే నిబంధన ఉన్నా పట్టించుకోకుండా వందల్లో హాజరయ్యారు. ఫించన్లు, పంచాయితీలంటూ గుమిగూడుతున్నారు. చాలామంది మాస్కులు ధరించడం లేదు. డిస్టెన్స్ పాటించకుండా ముచ్చట్లలో మునిగితేలుతూ కరోనా తెచ్చుకుంటున్నారు.

రూరల్ ఏరియాల్లో పెరిగిన కేసులు

రాష్ట్రంలో మార్చిలో కరోనా ఎఫెక్ట్ మొదలైంది. జులై 15 వరకు సుమారు 36 వేల కేసులు నమోదయ్యాయి. ఇందులో గ్రేటర్ హైదరాబాద్, ఇతర అర్బన్ ఏరియాల నుంచే ఎక్కువ కేసులు ఉన్నాయి. కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. గడిచిన నెలన్నర వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 75వేల కేసులు నమోదైతే. ఇందులో 53 వేల కేసులు జిల్లాల నుంచే వచ్చాయి. ఆ జిల్లాల్లో నూ కొద్ది రోజులుగా రూరల్ ఏరియాలు, అర్బన్ ఏరియాలతో పోటీ పడుతున్నాయి. పీహెచ్సీల పరిధిలో ఇటీవల యాంటీజెన్ టెస్టులు పెరగడంతో పెద్ద సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి.

ఉదాహరణకు నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు సుమారు 4,500 వరకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొదట్లో నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ లాంటి అర్బన్ ఏరియాల్లోనే ఎక్కువ కేసులు వచ్చేవి. నెల రోజులుగా జక్రాన్ పల్లి, వేల్పూర్, ఎడపల్లి, సాలూర తదితర పీహెచ్ సీల పరిధిలోని గ్రామాల్లో ఎక్కువ కేసులు వస్తున్నాయి. దీంతో మొత్తం కేసుల్లో రూరల్ పర్సంటేజ్ 80కి చేరిందని డాక్టర్లు అంటున్నారు. యాదాద్రి జిల్లాలో ఇప్పటి వరకు1,561 కేసులు రాగా, అందులో 900 కేసుల వరకు ఊళ్లలోనే ఉన్నాయి. అంటే ఈ జిల్లాలో 57శాతం కేసులు రూరల్ ఏరియాల్లోనే నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో మొత్తం 4,411 కేసులకు గాను 1,574 (35శాతం) రూరల్ ఏరియాలోనే వచ్చాయి. గడిచిన నెల రోజుల్లో అన్ని జిల్లాల్లోనూ కరోనా కేసుల్లో రూరల్ ఏరియా పర్సంటేజీ 10 నుంచి 30 శాతం మేర పెరిగినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. కరోనా వ్యాప్తి కి సంబంధించి ఆగస్టు, సెప్టెంబర్ నెలలు కీలకమని, ఈ టైంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా ఉండొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు.

ఇది జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని బల్వంతపూర్. గ్రామంలో 2,200 జనాభా ఉంది. ఈ నెల 13న ఒక ఇంట్లో జరిగిన పెండ్లికి చాలామంది పోయిన్రు. మాస్కులు, ఫిజికల్ డిస్టెన్స్ మాటే మరిచిపోయిన్రు. దీంతో ఒక్కరోజే ఏకంగా 62 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఇప్పుడు ఆ ఊరి జనమంతా గజగజ వణికిపోతున్నరు. సెల్ఫ్ లాక్ డౌన్ పెట్టుకొని ఇండ్లకే పరిమితమయ్యారు.