
Gold Price Today: అమెరికా సెకండరీ సుంకాల డెడ్ లైన్ దగ్గర పడటంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. దీనికి తోడు ఫెడ్ సెప్టెంబర్ సమావేశం, అమెరికా ఆర్థిక వ్యవస్థ పనితీరుపై నీలినీడలు కమ్ముకుంటున్న వేళ బులియన్ మార్కెట్ ప్రభావితం అవుతోంది. దీంతో వారాంతంలో ఇవాళ శనివారం రోజున పసిడి ధరలు భారీ పెరుగుదలను చూశాయి. ఇదే క్రమంలో రిటైల్ మార్కెట్లలో వెండి రేటు అమాంతం రూ.లక్ష 30వేలను తాకటం ఆందోళనలు పెంచుతోంది. దీంతో తెలుగు ప్రజలు తమ షాపింగ్ చేయటానికి ముందు తమ ప్రాంతాల్లోని రిటైల్ ధరలను ఖచ్చితంగా పరిశీలించాల్సి ఉంటుంది.
24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు ఆగస్టు 22 శుక్రవారంతో పోల్చితే ఇవాళ(ఆగస్టు 23న) రూ.వెయ్యి 90 పెరిగింది. దీంతో గ్రాముకు రేటు రూ.109 పెరిగిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో తాజా రేట్లను పరిశీలిస్తే..
24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాము (ఆగస్టు 23న):
- హైదరాదాబాదులో రూ.10వేల 162
- కరీంనగర్ లో రూ.10వేల 162
- ఖమ్మంలో రూ.10వేల 162
- నిజామాబాద్ లో రూ.10వేల 162
- విజయవాడలో రూ.10వేల 162
- కడపలో రూ.10వేల 162
- విశాఖలో రూ.10వేల 162
- నెల్లూరు రూ.10వేల 162
- తిరుపతిలో రూ.10వేల 162
ఇక 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు ఆగస్టు 22 శుక్రవారంతో పోల్చితే ఇవాళ(ఆగస్టు 23న) శనివారం రోజున రూ.వెయ్యి పెరిగింది. దీంతో గ్రాముకు రేటు రూ.100 పెరిగిందన్నమాట. ఏపీ తెలంగాణలోని ప్రధాన నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ రేట్లను గమనిస్తే..
22 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాము (ఆగస్టు 23న):
- హైదరాదాబాదులో రూ.9వేల 315
- కరీంనగర్ లో రూ.9వేల 315
- ఖమ్మంలో రూ.9వేల 315
- నిజామాబాద్ లో రూ.9వేల 315
- విజయవాడలో రూ.9వేల 315
- కడపలో రూ.9వేల 315
- విశాఖలో రూ.9వేల 315
- నెల్లూరు రూ.9వేల 315
- తిరుపతిలో రూ.9వేల 315
బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా ర్యాలీని కొనసాగిస్తోంది. ఆగస్టు 23న కేజీకి వెండి రూ.2వేలు పెరగటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్ష 30వేల మార్కును తాకింది. అంటే గ్రాము వెండి రేటు రూ.130 వద్ద కొనసాగుతోంది.