యుద్ధానికి బ్రేక్ పడింది.. గోల్డ్, సిల్వర్ రేటు పెరిగింది.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లివే..

యుద్ధానికి బ్రేక్ పడింది.. గోల్డ్, సిల్వర్ రేటు పెరిగింది.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లివే..

యుద్ధం ముగుస్తోందనే వార్తలతో విలువైన లోహాలు బంగారం, వెండి రేట్లకు మళ్లీ రెక్కలు వచ్చాయి. అమెరికా ఇరాన్ వార్ ఎప్పుడెప్పుడు ఆగిపోతుందా అని ఎదురుచూస్తున్న బులియన్ మార్కెట్ ఇన్వెస్టర్లు తాజా ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటనతో ఇన్వెస్ట్ చేసేందుకు ఎగబడుతూ డబ్బు కుమ్మరిస్తున్నారు. దీంతో దాదాపు నెల రోజులుగా పెద్ద మార్పు లేకుండా కొనసాగుతున్న బంగారం, వెండి తిరిగి పుంజుకుంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో షాపింగ్ చేయాలని అనుకుంటున్న ప్రజలు ముందుగా తమ నగరాల్లో పెరిగిన రేట్లను గమనించి నిర్ణయం తీసుకోవటం మంచిది. 

ఏప్రిల్8న బంగారం రేట్లు భారీగా పెరిగాయి. ఏప్రిల్ 7 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.398 పెరిగింది. అయితే హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 382గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 100గా కొనసాగుతోంది. 

బుధవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఏప్రిల్8, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.10వేలు పెరిగింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.10వేలు పెరిగి రూ.2లక్షల 65వేల వద్ద కొనసాగుతోంది. అంటే గ్రాము ధర ఎలాంటి మార్పులు లేకుండా రూ.265గా అమ్మకాలు జరుగుతున్నాయి.